Site icon HashtagU Telugu

IPL 2024: కొత్త కెప్టెన్ వచ్చేశాడు… సన్ రైజర్స్ రాత మారుతుందా ?

IPL 2024

IPL 2024

IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. శుక్రవారం చెన్నై, బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడుపుతున్నాయి. విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఆయా జట్లలో చేరుతున్నారు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ జట్టుతో కలిసాడు. ఉప్పల్ స్టేడియం వేదికగా ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు.మినీ వేలంలో పాట్‌ కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసి.. జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఐపీఎల్‌ వేలం చరిత్రలోనే ఇది రెండో అత్యధిక కొనుగోలు. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను విజేతగా నిలిపిన కమిన్స్‌.. సన్‌రైజర్స్‌ ను ఎలా నడిపిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గత కొన్ని సీజన్లుగా అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చివరిసారిగా డేవిడ్ వార్నర్‌ సారథ్యంలో 2016లో సన్ రైజర్స్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత సారథులు మారారే తప్ప.. జట్టుకు టైటిల్‌ అందించలేకపోయారు. ఈసారి కమిన్స్‌ నేతృత్వంలో ఛాంపియన్‌గా నిలవాలని ఆ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో పొట్టి క్రికెట్‌లో కమిన్స్‌ ప్రదర్శన, నాయకత్వ పటిమ అంత ఆశాజనకంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వేలంలో సన్ రైజర్స్ పలువురు కొత్త ఆటగాళ్ళను కూడా తీసుకుంది. గతంతో పోలిస్తే మెరుగ్గానే కనిపిస్తున్నా గ్రౌండ్ లో వీరంతా ఎంతవరకూ సత్తా చాటుతారనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Telangana: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోండి: హరీష్

Exit mobile version