Site icon HashtagU Telugu

IPL 2024: అయోధ్యను దర్శించుకున్న దక్షిణాఫ్రికా స్పిన్నర్

Ipl 2024

Ipl 2024

IPL 2024: దక్షిణాఫ్రికా ఎడమచేతి వాటం స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ రోజు అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించాడు. రామాలయాన్ని సందర్శించిన మహారాజ్ సోషల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేశారు. శ్రీరాముడికి గొప్ప భక్తుడినంటూ పేర్కొన్నాడు. అందరికీ జై శ్రీరామ్ ఆశీస్సులు అని మహరాజ్ ఫోటోతో క్యాప్షన్ జోడించాడు.

రామ మందిరాన్ని సందర్శించాలని కేశవ్ మహారాజ్ కొంతకాలంగా అనుకుంటున్నాడు. అయితే ఐపీఎల్ కారణంగా ఆ కోరిక నిరవేర్చుకున్నాడు. లక్నో ఫ్రాంచైజీలో చేరడం వల్ల రామ మందిరాన్ని సందర్శించే గొప్ప అవకాశం లభించిందని చెప్పాడు. కేశవ్ మాట్లాడుతూ.. నాకు దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంది. దేవుడు నాకు మార్గనిర్దేశం చేసి, ఆయనకు కృతజ్ఞతలు తెలిపే ఈ స్థితికి నన్ను తీసుకువచ్చాడని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. నేను హనుమంతుడు మరియు శ్రీరాముని భక్తుడిని. కాబట్టి నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను మైదానంలోకి అడుగుపెడుతున్నప్పుడు జైశ్రీరామ్ పాటను ప్లే చేయాల్సిందిగా స్టేడియంలోని డిజేని కోరినట్లు చెప్పుకొచ్చాడు కేశవ్.

లక్నో సూపర్‌జెయింట్స్ మార్చి 24న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్ ఐపీఎల్ ని ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరగనుంది.

Also Read: Tirumala: వేంకటేశ్వరస్వామికి గోవిందా అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా

Exit mobile version