GT vs MI: గుజరాత్ పై బుమ్రా విధ్వంసం

ఐపీఎల్ నాలుగో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది

GT vs MI: ఐపీఎల్ నాలుగో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. చాన్నాళ్ల తర్వాత ముంబై ఇండియన్స్ కి తిరిగి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా విధ్వంసం సృష్టించాడు. బుమ్రా 4 ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి గుజరాత్ ను చావుదెబ్బ కొట్టాడు.

జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా గతేడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు. అప్పటి నుంచి టీమ్ ఇండియా కోసం నిరంతరం శ్రమిస్తున్నాడు. వన్డే ప్రపంచకప్‌లోనూ సత్తా చాటాడు. కాగా ఈ రోజు మ్యాచ్ లో బుమ్రా గుజరాత్ పై విధ్వంసం సృష్టించాడు. అద్భుతమైన యార్కర్లను సంధించి వికెట్లను నేలకూల్చాడు. ఇన్నింగ్స్ లో బుమ్రా 4 ఓవర్లలో 13 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. బుమ్రా ఎకానమీ 3.50గా ఉంది. కాగా ఐపీఎల్‌లో బుమ్రా ఒకే మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టడం ఇది 20వ సారి. తద్వారా మలింగతో పాటు యుజువేంద్ర చాహల్‌ను అధిగమించాడు. మలింగ, చాహల్ 19-19 సార్లు ఐపీఎల్ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన ఘనత సాధించారు.

ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఒక మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన బౌలర్లు
20 – జస్ప్రీత్ బుమ్రా
19 – లసిత్ మలింగ
19 – యుజ్వేంద్ర చాహల్
17 – అమిత్ మిశ్రా
16 – డ్వేన్ బ్రావో
16 – ఉమేష్ యాదవ్
16 – రషీద్ ఖాన్

Also Read: Mudragada Padmanabham: మరో 30 ఏళ్ళు జగనే సీఎం