GT vs PBKS Dream11 Prediction: గుజరాత్ vs పంజాబ్… భీకరు పోరులో గెలిచేదెవరు ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. ఈ సీజన్ ఐపీఎల్ 17వ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడనున్నాయి.

 GT vs PBKS Dream11 Prediction: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. ఈ సీజన్ ఐపీఎల్ 17వ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడనున్నాయి.

గతేడాది రన్నరప్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్​లోనూ జోరు మీద ఉంది. ఆడిన 3 మ్యాచుల్లో రెండింట్లో గెలిచి మంచి ఊపులో కనిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్ 2 విజయాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ టైటాన్స్ తరఫున సాయి సురదర్శన్ 127 పరుగులతో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. అలాగే మోహిత్ శర్మ టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఈ సీజన్లో శర్మ ఇప్పటివరకు 6 వికెట్లు నేలకూల్చాడు. గత మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ పై గుజరాత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులకే పరిమితమైంది. వరుసగా 29 మరియు 24 పరుగులు చేసిన అభిషేక్ శర్మ మరియు హెన్రిచ్ క్లాసెన్ తప్ప, ఇతర బ్యాటర్‌లు ఎవరూ రాణించలేకపోయారు. ఆ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. మోహిత్ శర్మ ఒక్కడే 3 వికెట్లు తీశాడు.ఛేజింగ్ లో సాయి సురదర్శన్ మరియు డేవిడ్ మిల్లర్ వరుసగా 45 మరియు 44 పరుగులు చేసి టైటాన్స్‌ను గెలుపు దిశగా నడిపించారు.

పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం 1 విజయంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ తరఫున శిఖర్ ధావన్ 137 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. కగిసో రబాడ టాప్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. ఈ సీజనలో రబడా ఇప్పటివరకు 4 వికెట్లు తీసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ గత మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్‌ చేతిలో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. క్వింటన్ డి కాక్ తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. ఇక నికోలస్ పూరన్ చెలరేగి ఆడాడు. నికోలస్ కేవలం 21 బంతుల్లో 42 పరుగులు చేసి సూపర్ జెయింట్‌ను 20 ఓవర్లలో 199 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లాడు. ఛేజింగ్ సమయంలో, శిఖర్ ధావన్ మరియు జానీ బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. ధావన్ 70, బెయిర్‌స్టో 42 పరుగులు చేశారు. అయితే మయాంక్ యాదవ్ ధాటిగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టి పంజాబ్ కింగ్స్‌ను 178 పరుగులకే ఆలౌట్ చేశాడు.

We’re now on WhatsAppClick to Join

గుజరాత్-పంజాబ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే.. గుజరాత్, పంజాబ్‌లు ఇప్పటి వరకు 3 సార్లు తలపడ్డాయి . వాటిలో గుజరాత్ 2 గెలిచింది, పంజాబ్ 1 నెగ్గింది. ఇప్పటివరకు పంజాబ్ పై గుజరాత్ అత్యధిక స్కోరు 190, అలాగే గుజరాత్ పై పంజాబ్ అత్యధిక స్కోరు 189. గుజరాత్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్​లో ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుబ్​మన్ గిల్ మంచి టచ్​లో ఉన్నారు. సాయి సుదర్శన్ బ్యాక్ టు బ్యాక్ సూపర్బ్ నాక్స్​తో టీమ్​కు అతి పెద్ద బలంగా మారాడు.పంజాబ్ జట్టులో నెగెటివ్ పాయింట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ ఫెయిల్యూర్​ ఆ టీమ్​ను తీవ్రంగా వేధిస్తోంది. బ్యాటింగ్​లో కెప్టెన్ శిఖర్ ధావన్ ఒక్కడే కన్​సిస్టెంట్​గా రన్స్ చేస్తున్నాడు. బెయిర్​స్టో గత మ్యాచ్​తో ఫామ్​లోకి రావడం కలిసొచ్చే అంశం. మిగిలిన బ్యాటింగ్ యూనిట్ మొత్తం పేలవంగా పెర్ఫార్మ్ చేయడం టీమ్​కు బిగ్ మైనస్​గా మారింది. ఇక మ్యాచ్ అంచనా ప్రకారం గుజరాత్ నాల్గవ మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకడానికి 56% అవకాశం ఉంది.అయితే పంజాబ్ గుజరాత్​ను ఓడించడం కంటే టీమ్ ఎఫర్ట్​ పెట్టడంపై ఫోకస్ చేయాలి. ఆ టీమ్​ జీటీని మట్టికరిపించాలంటే తమ బెస్ట్​ గేమ్​ను బయటపెట్టాలి.

Also Read: DC vs KKR: సాగర తీరంలో పరుగుల సునామీ… కోల్ కత్తా హ్యాట్రిక్ విక్టరీ