IPL 2023: కోల్‌కతాకు శార్దూల్‌ ఠాకూర్‌..!

ఐపీఎల్‌ 2023 మినీ వేలానికి ముందు టీమ్స్‌ తమ ప్లేయర్స్‌ను ట్రేడింగ్ చేసుకుంటున్నాయి.

Published By: HashtagU Telugu Desk
968973 Ezgif.com Gif Maker 2021 04 09t162047.693

968973 Ezgif.com Gif Maker 2021 04 09t162047.693

ఐపీఎల్‌ 2023 మినీ వేలానికి ముందు టీమ్స్‌ తమ ప్లేయర్స్‌ను ట్రేడింగ్ చేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ మరో ప్లేయర్‌ను అమ్మేసింది. స్టార్‌ పేస్‌ బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను ఆ టీమ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీమ్‌కు ట్రేడింగ్ విండో ద్వారా మార్చుకుంది. గత వేలంలో శార్దూల్‌ను ఢిల్లీ టీమ్‌ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతడు పెద్దగా రాణించలేకపోయాడు. 14 మ్యాచ్‌లలో 15 వికెట్లు తీశాడు. అటు బ్యాట్‌తోనూ కేవలం 120 రన్స్‌ మాత్రమే చేయగలిగాడు. 2017 ఐపీఎల్‌ తర్వాత అతని చెత్త ప్రదర్శన ఇదే. దీంతో శార్దూల్‌ను వేరే టీమ్‌ను ఇచ్చేయాలని ఢిల్లీ నిర్ణయించింది. తాజాగా ఈ డీల్‌ పూర్తయినట్లు తెలిసింది.

ప్రస్తుతం శార్దూల్‌ ఠాకూర్‌ టీమిండియాతో కలిసి న్యూజిలాండ్‌ టూర్‌లో ఉన్నాడు. శార్దూల్‌ కోసం చెన్నై, గుజరాత్‌ టైటన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ కూడా ప్రయత్నించినా.. చివరికి కోల్‌కతా దక్కించుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇప్పటికే ఇలాంటివి మూడు డీల్స్‌ కుదుర్చుకుంది. గుజరాత్‌ టైటన్స్ నుంచి లాకీ ఫెర్గూసన్, రహ్మానుల్లా గుర్బాజ్‌లను కోల్‌కతా కొనుగోలు చేసింది. ఇప్పుడూ శార్దూల్‌న కూడా తీసుకోవడంతో ఆ టీమ్‌ మరింత బలంగా మారింది.

  Last Updated: 15 Nov 2022, 12:32 PM IST