Site icon HashtagU Telugu

Rohit Sharma: “రోహిత్ శర్మ ఐపీఎల్ ఆడకుండా బ్రేక్ తీసుకుంటే మంచిది”.. సునీల్ గవాస్కర్ కీలక సూచన..!

Rohit Sharma

Resizeimagesize (1280 X 720) 11zon

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) విశ్రాంతి తీసుకోవాలని దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar)ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. రోహిత్ శర్మ ఐపీఎల్ నుండి కొంత విరామం తీసుకుని ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు తిరిగి రావాలని గవాస్కర్ అన్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుండి లండన్‌లోని ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగనుంది. ఐపీఎల్ 2023 ఫైనల్ మే 28న జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సిద్ధమయ్యేందుకు భారత ఆటగాళ్లకు ఎక్కువ సమయం ఉండదు.

మంగళవారం జరిగిన ఐపీఎల్ 2023 35వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసి ఓడిపోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రోహిత్ శర్మ తాజాగా రావాలంటే కాస్త విశ్రాంతి తీసుకోవాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మ్యాచ్ అనంతరం చెప్పారు. గవాస్కర్ మాట్లాడుతూ.. “WTC ఫైనల్‌ కోసం రెడీ అయ్యేందుకు రోహిత్‌ శర్మ ఐపీఎల్ నుంచి బ్రేక్‌ తీసుకోవాలి. ఐపీఎల్‌ చివరిలో కొన్ని మ్యాచులకు మళ్లీ రావాలి. కానీ ఇప్పుడైతే అతడికి కాస్త విశ్రాంతి అవసరం’ అని సూచించారు.

Also Read: Sara Tendulkar: ఆ ఇద్దరిపై సారా టెండూల్కర్ రియాక్షన్ .. మీమ్స్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి ఓవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య WTC ఫైనల్ 2023 జూన్ 7-11 వరకు లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతుందని తెలిసిందే. జూన్ 12 రిజర్వ్ డేగా ఉంచారు.

WTC 2023 ఫైనల్ కోసం భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.