Site icon HashtagU Telugu

IPL 2023 Qualifier 2: బలమైన జట్లతో రసవత్తర పోరు: క్వాలిఫైయర్-2

IPL 2023 Qualifier 2

New Web Story Copy 2023 05 25t192212.828

IPL 2023 Qualifier 2: ఐపీఎల్ 2023 క్వాలిఫైయర్-2 మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో గుజరాత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై 81 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను చిత్తు చేసింది.

గతేడాది చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఇప్పటి వరకు జరిగిన టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసింది. లీగ్ మ్యాచ్‌ల్లో గుజరాత్ 14 మ్యాచ్‌ల్లో 10 గెలిచింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు అద్భుతంగా రాణిస్తున్నారు. శుభ్‌మన్ గిల్ బ్యాట్ తో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో గిల్ గుజరాత్ తరఫున వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్ మంచి ఫినిషర్లుగా ఉండనే ఉన్నారు. బౌలింగ్‌లో మహ్మద్ షమీ ఉన్నాడు. పవర్‌ప్లేలో షమీ ఒక్కడు చాలు. షమీ ఇప్పటి వరకు 26 వికెట్లు తీశాడు. మరో బౌలర్ రషీద్ ఖాన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు రషీద్ 25 వికెట్లు పడగొట్టాడు. జట్టు తరఫున యశ్ దయాల్, మోహిత్ శర్మ సత్తా చాటుతున్నారు.

ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) మొదటి మ్యాచ్ లలో ఫామ్‌తో పోరాడింది. బౌలర్లు లైన్ లెంగ్త్ కోసం చూస్తుంటే బ్యాట్స్‌మెన్ల నుంచి పరుగులే రావడం లేదు. తర్వాతతర్వాత ముంబై పుంజుకోవడం ప్రారంభించింది. మిడిలార్డర్‌లో తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, సూర్య మెరిశారు. ఈ సీజన్‌లో ముంబై 5 సార్లు 200 కంటే ఎక్కువ స్కోరును ఛేజ్ చేసింది. ముంబైలో జస్ప్రీత్ బుమ్రా మరియు జోఫ్రా ఆర్చర్‌ల లేని లోటు స్పష్టంగా కనిపించింది. అయితే క్రిస్ జోర్డాన్ మరియు జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ లు జట్టుని ఆదుకున్నారు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆకాష్ మధ్వల్ 5 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం అద్భుతం. స్పిన్‌లో అనుభవం ఉన్న పీయూష్ చావ్లా తనదైన ముద్ర వేయగలిగాడు. ఓవరాల్‌గా టీమ్‌ మళ్లీ పాత వైభవాన్ని ప్రదర్శిస్తుంది.

గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, దసున్ షనక, వృద్ధిమాన్ సాహా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, హృతిక్ షోకిన్, కెమెరూన్ గ్రీన్, పీయూష్ చావ్లా, ఇషాన్ కిషన్, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, ఆకాష్ మధ్వల్, క్రిస్ జోర్డాన్

Read More: IPL Finals @Modi Stadium: మోదీ స్టేడియం ప్రత్యేకతలేంటో తెలుసా