Site icon HashtagU Telugu

IPL 2023 Opening Ceremony LIVE: ఐపీఎల్ కు గ్లామర్ షో.. రష్మిక, తమన్నా లైవ్ డాన్స్

IPL 2023 Opening Ceremony LIVE

Ipl 2023 Gt Vs Csk Live Score

IPL 2023 Opening Ceremony: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న IPL 2023 వచ్చేస్తోంది. ఇవాళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌ను కు సంబంధించిన వేడుకలు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు జరగనున్నాయి. సూపర్ స్టార్ సింగర్ అరిజిత్ సింగ్ ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ వేడుకల్లో రష్మిక మదన్న, తమన్నా భాటియా కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలువబోతున్నారు. తమ డాన్సులతో ఐపీఎల్ వేడుకలను హోరోత్తించాబోతున్నారు. ఈవెంట్ తర్వాత అదే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనున్నాయి.

2018 తర్వాత ఐపీఎల్‌లో ఈరోజు ప్రారంభోత్సవం జరగడం కూడా ఇదే తొలిసారి. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులర్పిస్తూ బీసీసీఐ 2019లో దీన్ని రద్దు చేసింది. ఆ తర్వాత కోవిడ్ భయపెట్టడంతో 2020-2022 వరకు ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. WPL ప్రారంభ సీజన్‌లో ధిల్లాన్, కియారా అద్వానీ, కృతి సనన్ డాన్స్ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే ఐపీఎల్ వేడుకలు అందర్నీ ఆకర్షించబోతున్నాయి.