Site icon HashtagU Telugu

IPL 2023: వచ్చే ఐపీఎల్ 60 రోజులే.. కారణం అదే

Image 1669980511

Image 1669980511

ఐపీఎల్ 16వ సీజన్ కు బీసీసీఐ సన్నాహాలు మొదలయ్యాయి. ఇటీవలే మినీ వేలం ముగియగా.. ఫ్రాంచైజీలు తమ జట్ల కూర్పులో బిజీగా ఉన్నాయి. గత సీజన్ లో 10 జట్లు చేరడంతో లీగ్ స్థాయి పెరిగింది. రెండు కొత్త జట్ల ఎంట్రీ మ్యాచ్ ల సంఖ్య కూడా పెరగడం సహజమే. దీంతో వచ్చే ఏడాది నుంచి రోజుల సంఖ్య కూడా పెరగనుందని బీసీసీఐ ముందే చెప్పింది. దాదాపు 74 రోజుల పాటు లీగ్ జరిగే అవకాశమున్నట్టు అంచనా వేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం వచ్చ ఐపీఎల్ సీజన్ కూడా 60 రోజుల్లోనే ముగించాల్సి రావొచ్చు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఉండడమే దీనికి కారణం. ఐసీసీ నిబంధనల ప్రకారం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వారం రోజుల ముందే ఏ టోర్నీ లేదా ద్వైపాక్షిక సిరీస్ లు ముగిసిపోవాలి.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ 16వ సీజన్ 74 రోజులు జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ కు కేవలం 3 లేదా 4 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. అందుకే 60 రోజుల్లోనే ఇప్పుడు బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్ రూపొందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్ ఖరారు కానప్పటకీ… బోర్డు వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 1న ఆరంభమై.. మే 31న ముగిసే అవకాశముంది. బీసీసీఐ కొత్తగా ఆరంభించనున్న మహిళల ఐపీఎల్ కూడా పురుషుల ఐపీఎల్ షెడ్యూల్ పై ప్రభావం చూపించింది. మహిళల ఐపీఎల్ ను మార్చిలోనే నిర్వహించాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూల్ 7 నుంచి 11 వరకూ జరిగే అవకాశముండగా..దీని ప్రకారం ఐపీఎల్ సీజన్ మే 31 లోపే ముగిసిపోవాలి. దీంతో ఈ సారి 74 రోజుల విండో కష్టమేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఏడాదిలో ఐపీఎల్ షెడ్యూల్ పై పూర్తి క్లారిటీ రానుంది.

Exit mobile version