IPL 2023 Highlights: ఐపీఎల్ 2023 హైలైట్స్ – ఆసక్తికర సన్నివేశాలు

రెండు నెలలుగా క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2023 సీజన్ ఎట్టకేలకు ముగిసింది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా సోమవారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ హోరాహోరీగా తలపడ్డాయి.

IPL 2023 Highlights: రెండు నెలలుగా క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2023 సీజన్ ఎట్టకేలకు ముగిసింది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం ( Narendra Modi Stadium) వేదికగా సోమవారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ హోరాహోరీగా తలపడ్డాయి. వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ వాయిదా పడ్డప్పటికీ విజేతగా మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఇప్పటివరకు చెన్నై ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోగా.. గత సీజన్లో హార్దిక్ పాండ్య సేన ఐపీఎల్ కప్ గెలుచుకుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగింది. మరోవైపు ఈ సీజన్లో ఎన్నో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.

ఐపీఎల్ 2023లో ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ చేయని రికార్డులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్లో నమోదైన రికార్డులను ఒకసారి చూద్దాం. (IPL 2023 Highlights)

ఐపీఎల్‌లో ఇద్దరు సోదరులు ఒకరిపై ఒకరు కెప్టెన్‌లుగా రంగంలోకి దిగడం ఇదే తొలిసారి. ఐపీఎల్ 2023 , 51వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌కు చెందిన కృనాల్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్‌కు చెందిన హార్దిక్ పాండ్యా కెప్టెన్‌లుగా వ్యవహరించారు. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇద్దరు అన్నదమ్ములు కెప్టెన్లుగా వ్యవహరిస్తూ ఒకే మ్యాచ్ లో తలపడటం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఐపీఎల్ 16వ సీజన్‌లో ఏప్రిల్ 30న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లో ప్రత్యేక రికార్డు నమోదైంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోని నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 200 స్కోరు చేశారు. ఐపీఎల్ చరిత్రలో ఒకే రోజు నాలుగు 200 ప్లస్ స్కోర్లు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కాగా మరో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది.

ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఒక సీజన్‌లో సెంచరీల మోత మోగింది. ఈ సీజన్‌లో తొలి సెంచరీని సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్ నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో మొత్తం 12 సెంచరీలు నమోదయ్యాయి.

రాజస్థాన్‌ రాయల్స్‌ యువ బ్యాట్స్‌మెన్‌ యశస్వి జైస్వాల్‌ ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. 13 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా యశస్వి జైస్వాల్‌ కీరన్ పొలార్డ్ రికార్డును బద్దలు కొట్టాడు.

ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య జరిగింది. ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారిగా ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన రెండు జట్లు ఫైనల్‌లో తలపడడం విశేషం. చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌ని మార్చి 31న ఆడారు, ఆపై 29 మే 2023న ఫైనల్ మ్యాచ్ ఆడారు. విశేషం ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ లో గుజరాత్ గెలిస్తే చివరి మ్యాచ్ లో ధోని సేన గెలిచి కప్ తన్నుకుపోయింది.

Read More: MS Dhoni Lifts Jadeja: విజయం తర్వాత భావోద్వేగంతో జడేజాను ఎత్తుకున్న ధోనీ.. వైరల్ అవుతున్న వీడియో..!