Site icon HashtagU Telugu

Mumbai Indians IPL: వారిద్దరూ లేకున్నా బలంగానే ముంబై.. తుది జట్టు కూర్పు ఇదే

Ipl 2023 Here Is Mumbai Indians Strongest Playing 11

Ipl 2023 Here Is Mumbai Indians Strongest Playing 11

IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఐపీఎల్ అనగానే అందరికీ గుర్తొచ్చే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ అయితే గత సీజన్ లో మాత్రం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) దారుణంగా విఫలమైంది. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌లలో కేవలం 4 మాత్రమే గెలిచి 8 మ్యాచ్‌లు ఓడిపోయింది. మిగిలిన జట్లతో పోలిస్తే అందరికన్నా ముందే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. దీంతో ఈ సారి మినీ వేలంలో ఆచితూచి వ్యవహరించిన ముంబై కీలక ఆటగాళ్ళను కొనుగోలు చేసింది. అయితే మరోసారి గాయాలు వెంటాడడంతో జస్ప్రీత్ బూమ్రా, జే రిచర్డ్ సన్ లు దూరమవడం ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఈ నేపథ్యంలో ముంబై తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

గత సీజన్ లో సరైన ఓపెనింగ్ ఆరంభం లేకపోవడం ముంబై అవకాశాలను దెబ్బతీసంది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ ఫామ్ అందుకోవడంతో ముంబై మేనేజ్ మెంట్ హ్యాపీగా ఉంది. గతంతో పోలిస్తే ఇషాన్ కిషన్ ఆటగాడిగా ఎంతో మెరుగయ్యాడు. అటు గాయాలతో తరుచూ ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మకు కూడా ఈ సీజన్ చాలా కీలకం. ఈ సీజన్‌లో విఫలమైతే మాత్రం రోహిత్ కెరీర్ఇ కు ఇబ్బందే. అందుకే హిట్ మ్యాన్ దంచికొట్టాలని మేనేజ్ మెంట్ ఎదురుచూస్తోంది.

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై తరఫున రాణించిన బ్యాటర్లు సూర్య, తిలక్, టీమ్ డేవిడ్. గాయం కారణంగా సూర్య కొన్ని మ్యాచ్‌లకు దూరమైనా.. ఆడిన మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. తిలక్ వర్మ.. తన అరంగేట్ర సీజన్‌లోనే దుమ్మురేపి అందరి ప్రశంసలు అందుకున్నాడు. మూడో స్థానంలో బరిలోకి దిగి 14 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీలతో 397 పరుగులు చేశాడు. సూర్యకుమార్ 8 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీలతో 303 పరుగులు చేశాడు. హాఫ్ సీజన్ తర్వాత బరిలోకి దిగిన టీమ్ డేవిడ్.. అసాధారణ ఆటతో ఆకట్టుకున్నాడు. ఈ ముగ్గురూ ఐపీఎల్ 2023లోనూ మిడిలార్డర్ బాధ్యతలు మోయనున్నారు.జట్టు పరిస్థితులకు తగ్గట్లు వీరి బ్యాటింగ్ స్థానాలు మారే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే సీజన్ కు ముందే వరుస గాయాలు ముంబై బౌలింగ్ దళంపై ప్రభావం చూపనున్నాయి. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో మరికొన్ని నెలలు ఆటకు దూరమయ్యాడు. దీంతో బూమ్రా లేకుండానే బరిలోకి దిగుతోంది ముంబై. అటు జే రిచర్డసన్‌ కూడా ఐపీఎల్ కు దూరమవడం ముంబైకి మరో ఎదురుదెబ్బ. బూమ్రా లేకపోవడంతో రిచర్డ్ సన్ తో భర్తీ చేయొచ్చని ఆశలు పెట్టుకుంటే గాయంతో అతను తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ముంబై పేస్ విభాగంలో జోఫ్రా ఆర్చర్ , జాసన్ బెహండ్రాఫ్ లే కీలకం కానున్నారు. గాయంతో ఆర్చర్ గత సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరో పేసర్ గా కామెరూన్ గ్రీన్ ఆడనున్నాడు.

17.50 కోట్ల భారీ ధరకు గ్రీన్ ను కొనుగోలు చేసిన ఈ ఆసీస్ పేసర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రతీ సీజన్‌లో ఓ యంగ్ టాలెంట్‌ పై ఫోకస్ చేసే ముంబై ఇండియన్స్ (Mumbai Indians) 2022లో కుమర కార్తీకేయ ప్రతిభను వెలికి తీసింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా ఇబ్బంది పడుతున్న ముంబైకి కుమార్ కార్తీకేయ ఈ సారి కీలకం కానున్నాడని చెప్పొచ్చు. మరో స్పిన్నర్ గా పియూష్ చావ్లా , రమణ్‌దీప్ సింగ్, హృతికి షోకీన్‌లో ఒకరికి అవకాశం దక్కవచ్చు. మొత్తం మీద ఇద్దరు కీలక పేసర్లు దూరమైనప్పటకీ.. ముంబై ఇండియన్స్ ను తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది.

Also Read:  Soaps: నోరూరించే సబ్బులను చూసారా మీరు!