Gujarat Titans: ఈ సారీ టైటిల్ మాదే.. కాన్ఫిడెంట్ గా గుజరాత్ టైటాన్స్

టైటిల్ ఫేవరెట్ జట్లలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ముందుంటుందనడంలో డౌట్ లేదు. గత సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ అరంగేట్రంలోనే అదరగొట్టేసింది.

  • Written By:
  • Updated On - March 24, 2023 / 01:39 PM IST

ఐపీఎల్ 16వ సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జట్ల సంఖ్య పెరగడం, గత సీజన్ తో పోలిస్తే కొన్ని కొత్త నిబంధనలు , మినీ వేలం తర్వాత మారిన పలు జట్ల తీరు.. ఇలాంటి ఆసక్తికర పరిణామాలతో వచ్చే సీజన్ ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. ప్రస్తుతం ఫ్రాంచైజీలు తమ తుది జట్టు కూర్పు, వ్యూహరచనలో బిజీగా ఉన్నాయి. ఈ సారి టైటిల్ ఫేవరెట్ జట్లలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ముందుంటుందనడంలో డౌట్ లేదు. గత సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ అరంగేట్రంలోనే అదరగొట్టేసింది. సంచలన ప్రదర్శనతో పలు పెద్ద జట్లకు షాకిస్తూ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా గుజరాత్ ను సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపించి ఛాంపియన్ గా నిలిపాడు. మినీ వేలం తర్వాత గుజరాత్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది.

గుజరాత్ టైటాన్స్ బలాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది కెప్టెన్ హార్థిక్ పాండ్యా గురించే.. గాయం నుంచి కోలుకుని ఐపీఎల్ లోకి రీఎంట్రీ ఇచ్చిన పాండ్యా సారథిగా తొలి సీజన్ లోనే ఆకట్టుకున్నాడు. కెప్టెన్ గానే కాకుండా ఆల్ రౌండర్ గా తనదైన పాత్ర పోషించి జట్టు విజయాల్లో కీలకమయ్యాడు. అలాగే గుజరాత్ జట్టులో ఎక్కువమంది ఆల్‌రౌండర్లు ఉండటం అడ్వాంటేజ్.పాండ్యాతో పాటు రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, ఓడియన్ స్మిత్‌లు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్ళు. వీరంతా ఒంటిచేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పేవారే. అలాగే స్టార్ ప్లేయర్లు శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, డేవిమిల్లర్ ఫామ్‌లో ఉండటం కూడా ఆ జట్టు కలిసొచ్చే అంశం. గిల్ , సాహా గత సీజన్ నిలకడగా రాణించారు. వీరితో పాటు మిడిలార్డర్ లో డేవిడ్ మిల్లర్ పెద్ద బలంగా చెప్పొచ్చు.

గతేడాది కాస్త బలహీనంగా కనిపించిన మిడిలార్డర్‌ను మినీవేలంలో గుజరాత్ బలోపేతం చేసుకుంది. 2 కోట్ల కనీస ధరకు దొరికిన కేన్ విలియమ్సన్‌ను తీసుకోవడంతో గుజరాత్ మిడిలార్డర్‌ బలం పెరిగింది. కేన్ మామ ఫామ్ లో ఉండడంతో గుజరాత్ మేనేజ్ మెంట్ ఫుల్ జోష్ లో ఉంది. ఇక బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది. భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా కోచింగ్ గుజరాత్ కు అడ్వాంటేజ్. మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, శివమ్ మావి పేస్ భారాన్ని మోయనున్నారు. గత సీజన్‌లో షమీ 16 మ్యాచ్‌ల్లో 20 వికెట్లతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓవర్ సీస్ కోటా అల్జారీ జోసెఫ్‌ను ఆడించనుంది. పిచ్ పరిస్థితులను బట్టి సాయి కిషోర్, శివమ్ మావిలో ఒకరికి చోటు దక్కొచ్చు. మొత్తం మీద గత సీజన్ లో టైటిల్ కొట్టిన గుజరాత్ వేలం తర్వాత మరింత పటిష్టంగా మారి ఇప్పుడు వరుసగా రెండో టైటిల్ పై కన్నేసింది.