ఐపీఎల్ మ్యాచ్ లను ఆస్వాదిస్తున్న అభిమానులకు ఇది గుడ్ న్యూస్ లాంటిది. వీకెండ్ లో ఫుల్ ఎంజాయ్ చేసేలా మ్యాచ్ లు హోరాహోరీగా, వరసుగా జరగబోతున్నాయి. ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు (డబుల్ హెడర్) నిర్వహిస్తున్నారు. తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడనున్నాయి. కాగా, తొలి మ్యాచ్ కు ముంబయి బ్రాబౌర్న్ స్టేడియం వేదికగా నిలవనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇకపై తాను ఆడే ప్రతి మ్యాచ్ ను ముంబయి జట్టు తప్పక గెలవాల్సి ఉంటుంది. అందుకే చావోరేవో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది.