Site icon HashtagU Telugu

Sanju Samson : సంజూ శాంసన్ అరుదైన రికార్డు

Ipl 2022 Csk Vs Kkr

Ipl 2022 Csk Vs Kkr

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా మంగళవారం రాత్రి ఎంసీఏ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ ఆడడం ద్వారా రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున 100 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా సంజూ శాంసన్‌ అరుదైన రికార్డు సాధించాడు..అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆ జట్టు మాజీ కెప్టెన్ అజింక్య రహానే ఒక్కడే100 మ్యాచులు ఆడిన ఘనత సాధించగా.. తాజాగా ఆ రికార్డును సంజూ శాంసన్‌ కూడా సాధించాడు..

ఇక ఐపీఎల్ 2013 సీజన్ ద్వారా ఐపీఎల్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన సంజూ శాంసన్‌ ఇప్పటి వరకు 121 మ్యాచ్‌ల్లో 134.21 సగటుతో 3068 పరుగులు సాధించాడు.. ఇందులో 3 సెంచరీలు, 15 ఆఫ్ సెంచరీలున్నాయి… ఇక టీమిండియా తరపున 13 టి20లు, ఒక వన్డే మ్యాచ్‌ ఆడిన సంజూ శాంసన్‌. బంతిని బలంగా బాదడంలో స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా విఫలమైనప్పటికి.. బ్యాట్స్‌మగా మాత్రం ఎప్పుడు వైఫల్యం చెందలేదనే చెప్పాలి. ఇక ఐపీఎల్ 2022 సీజన్లో టైటిల్ గెలవడమే టార్గెట్ గా బరిలోకి దిగుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు అందుకు అనుగుణంగానే మెగా వేలంలోట్రెంట్ బౌల్ట్,షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్‌ ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

Exit mobile version