Site icon HashtagU Telugu

Rohit Sharma: క్రికెట్ లో నాకు స్ఫూర్తి సచినే – రోహిత్ శర్మ

Rohit

Rohit

ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ జట్టు ఇంకా గెలుపు బోణీ కొట్టని సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఐదుసార్లు ముంబై ఇండియన్స్ జట్టుని టైటిల్ విన్నర్ గా నిలిపిన రోహిత్‌ శర్మ ఈసారి ముంబై ఇండియన్స్‌ను మరోసారి టైటిల్ విన్నర్ గా నిలుపుతాడా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్ జట్టుకు క్రికెట్​ దిగ్గజం సచిన్​ టెండూల్కర్ మెంటార్​గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సచిన్​ గురించి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు​.

క్రికెట్ లో నాకు ఎప్పటికీ సచిన్​ టెండూల్కర్ నాకు స్ఫూర్తి. ఊహ తెలిసినప్పటినుంచి అతని​ ఆటను చూస్తు పెరిగాను. ఆయన క్రికెట్ లో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. క్రికెట్ లో దాదాపు 25 ఏళ్లు సేవలందించాడు. ఎన్నో రికార్డులు సాధించినా.. ఆ గర్వం ఆయనలో ఎక్కడా కనిపించదు అని రోహిత్​ శర్మ పేర్కొన్నాడు. అలాగే ఐపీఎల్ 15వ సీజన్ ముంబై లో జరుగుతుందండం వాళ్ళ తమకు పెద్దగా ఉపయోగమేమీ ఉండదని పేర్కొన్నాడు. అయితే ఐపీఎల్​ 2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్​ ఆ తర్వాత రాజస్థాన్​ రాయల్స్​తో ఓటమిపాలైంది. అలాగే ఈ సీజన్ లో భాగంగా తమ తరువాతి మ్యాచ్ లో బుధవారం కోల్​కతా నైట్​రైడర్స్​తో పోటీపడనుంది.

ఇదిలాఉంటే ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం ముంగిట ముంబై ఇండియన్స్‌ జట్టు మొత్తం 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది వారిలో 17 మంది భారత్‌కు చెందినవారు ఉండగా.. 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అంతకుముందు రిటెన్షన్ ప్రక్రియలోభాగంగా రోహిత్‌ శర్మ, కీరన్‌ పొలార్డ్‌, బుమ్రా, సూర్యకుమార్‌లను తమ వద్దే అట్టిపెట్టుకుంది. మిగతా 21 మంది ఆటగాళ్లను మెగావేలంలో కొనుగోలు చేసింది.

Exit mobile version