IPL 2022 Qualifications: బెంగుళూరు ప్లే ఆఫ్ చేరాలంటే..?

ఐపీఎల్ 2022 సీజన్ తొలి దశ మ్యాచుల్లో వరుస విజయాలతో అదరగొట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండో దశ సీజన్ లో మాత్రం వరుసగా మూడు ఓటములతో తీవ్రంగా నిరాశ పరిచింది.

  • Written By:
  • Publish Date - May 3, 2022 / 12:02 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ తొలి దశ మ్యాచుల్లో వరుస విజయాలతో అదరగొట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండో దశ సీజన్ లో మాత్రం వరుసగా మూడు ఓటములతో తీవ్రంగా నిరాశ పరిచింది. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలు మాత్రమే సాధించిన బెంగళూరు జట్టు.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా.. లీగ్ దశలో ఆ జట్టు ఇంకా 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది.

ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు మే 22న ముగియనుండగా.. అప్పటికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కి చేరుకోనున్నాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో గుజరాత్ టైటాన్స్‌ జట్టు 16 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా.. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ 14 పాయింట్లతో రెండో ప్లేస్ లో, రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లతో మూడో ప్లేస్ లో అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే టోర్నీలో మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కచ్చితంగా నాలుగు మ్యాచులు గెలిచి తీరాలి.. వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలుపొందితే ఆర్సీబీ ఖాతాలో 18 పాయింట్లు చేరుతాయి. దాంతో ఆ జట్టు సునాయాసంగా ప్లే ఆఫ్స్ చేరుకోవచ్చు. అయితే ఈ 4 మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ లో ఓడితే బెంగళూరు జట్టుకు 16 పాయింట్స్ లభిస్తాయి. మెరుగైన రన్ రేట్ ఉంటే మాత్రం నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే నెట్ రన్ రేట్ కీలకం కానుంది. ప్రస్తుతం బెంగళూర్ నెట్ రన్ రేట్ తక్కువగా ఉన్న కారణంగా మిగతా మ్యాచుల్లో ఆ జట్టు భారీ విజయాలు సాదించాల్సి ఉంటుంది.