David Warner : వార్నర్ పై గవాస్కర్ ప్రశంసలు

ఐపీఎల్‌ 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లో రెండు జట్లపై వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ గా అరుదైన ఘనత సాధించాడు.

  • Written By:
  • Updated On - April 30, 2022 / 12:34 PM IST

ఐపీఎల్‌ 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లో రెండు జట్లపై వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ గా అరుదైన ఘనత సాధించాడు. పంజాబ్ కింగ్స్ పై తొలుత 1000 పరుగులు మైలురాయిని దాటినా తొలి బ్యాటర్ గా రికార్డు నెలకొల్పిన వార్నర్, కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై కూడా వెయ్యి పరుగులు సాధించిన రెండో బ్యాటర్ గా అరుదైన ఘనత సాధించాడు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ జట్టు తరఫున అదరగొడుతున్న డేవిడ్ వార్నర్‌ ఆటతీరుపై టీమ్‌ఇండియా క్రికెట్‌ దిగ్గజం సునిల్ గవాస్కర్‌ ఆసక్తికర వ్యాక్యలు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ డ్రస్సింగ్‌ రూమ్‌లోని ఆరోగ్యకరమైన వాతావరణం కారణంగానే డేవిడ్‌ వార్నర్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇంతకుముందు సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు డ్రెస్సింగ్ రూమ్ లో వార్నర్ కు ఇది దొరకలేదు. వార్నర్ ఎప్పుడైతే సన్ రైజర్స్ జట్టు నుండి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మారాడో అప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాడు. తన బ్యాటింగ్‌ లో భారీ మార్పు వచ్చిందనీ గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు.

ఇదిలాఉంటే గత రెండు సీజన్లలో అభిమానుల్ని నిరాశపరిచిన డేవిడ్‌ వార్నర్‌ ప్రస్తుత సీజన్‌లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. ఆడిన 5 మ్యాచుల్లో మూడు ఆఫ్ సెంచరీలతో 219 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ తరఫున జట్టు తరఫున ఆడిన డేవిడ్‌ వార్నర్‌.. ఎక్కువగా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.ఈ క్రమంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్‌ ఈ సీజన్ ముంగిట డేవిడ్‌ వార్నర్‌ను విడిచిపెట్టగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది.