Site icon HashtagU Telugu

IPL 2022 : బబుల్ బ్రేక్ చేస్తే కోటి జరిమానా..నిషేధం

Tata Ipl

Tata Ipl

ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26న చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగే మ్యాచ్ తో షురూ కానుంది. ఈమేరకు ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్ ప్రారంభించాయి. బీసీసీఐ ఈసారి చాలా కఠినమైన బయో బబుల్ నిబంధనలను రూపొందించింది. బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించిన ఆటగాడిపై ఒక మ్యాచ్ నిషేధంతోపాటు, జట్టు పాయింట్లను తగ్గించనుంది. వీటితోపాటు కోటి రూపాయల వరకు జరిమానా విధించే నిబంధనను తీసుకొచ్చింది. గత సీజన్ లో బయో బబుల్ లోకి కరోనా కారణంగా టోర్నీనీ వాయిదా వేయవలసి వచ్చింది. దీంతో ఈసారి అటువంటి తప్పిదం జరగకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.

బయో బబుల్‌లో ఎవరైనా ఆటగాడు లేదా అతని కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు.. ఆ జట్టు యజమాని లేదా వారితో ఉన్న వ్యక్తులు బయో బబుల్‌ను ఉల్లంఘించకూడదు. ఒకే ఈ నియమాలను ఉల్లంఘిస్తే.. ఆ భారాన్ని వారే భరించాల్సి ఉంటుంది. బయో బబుల్‌ను ఉల్లంఘించినందుకు, ఆటగాడిపై ఒక మ్యాచ్ నిషేధంతోపాటు మరో 7 రోజులు క్వారంటైన్‌లో ఉండవలసి ఉంటుందని బీసీసీఐ ధృవీకరించింది. బయో బబుల్‌ను ఆటగాడి కుటుంబం లేదా మ్యాచ్ అధికారి ఉల్లంఘిస్తే, వారిపై మరింత తీవ్రమైన చర్యలు తీసుకోనున్నారు.ఐపీఎల్ 2022 సమయంలో ఒక జట్టు ఉద్దేశపూర్వకంగా బయటి వ్యక్తిని జట్టులోకి తీసుకరాకూడదు. ఇందుకు జరిమానగా ఒక కోటి రూపాయల వరకు చెల్లించవలసి ఉంటుంది. అలాగే మళ్లీ అలాంటి పొరపాటు జరిగితే జట్టుకు ఒకటి లేదా రెండు పాయింట్లు కోత విధిస్తారు.

ప్లేయర్ బయో బబుల్‌ను బ్రేక్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.మొదటి సారి బయో బబుల్‌ను బ్రేక్ చేసిన ఆటగాడు 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండవలసి ఉంటుంది. అలాగే ఆ సమయంలో ఆడని మ్యాచ్‌లకు డబ్బు లభించదు. రెండవసారి ఇలానే చేస్తే.. ఆ ఆటగాడు ఏడు రోజుల క్వారంటైన్‌తో పాటు ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. మూడవసారి చేస్తే.. ఆ ఆటగాడు మొత్తం సీజన్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే జట్టుకు ప్రత్యామ్నాయం కూడా ఇవ్వబోరని తెలుస్తోంది. ఏ ప్లేయర్ కుటుంబ సభ్యులయినా బ్రేక్ చేస్తే కూడా చర్యలు తప్పవు. మొదటిసారి ఆటగాడి కుటుంబ సభ్యులు 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండవలసి ఉంటుంది. రెండవసారి బయోబబుల్ బ్రేక్ చేస్తే.. ఆ ప్లేయర్ కుటుంబం, స్నేహితుడు బయో బబుల్ నుంచి తొలగిస్తారు. అలాగే వారితో ఆన్న ఆటగాడు 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండవలసి ఉంటుంది.