Site icon HashtagU Telugu

IPL 2022 Ceremony: ఒలింపిక్ విజేతలకు బీసీసీఐ సర్ ప్రైజ్

Ipl

Ipl

ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఐపీఎల్‌ టోర్నీ ఆరంభ వేడుకలను లీగ్‌ ప్రారంభం నుంచి నిర్వహిస్తూ వచ్చింది. అయితే ఐపీఎల్ 2018 సీజన్ తర్వాత వరుసగా మూడు సీజన్ల పాటు బీసీసీఐ ఆరంభ వేడుకలు నిర్వహించలేదు. తాజాగా శనివారం నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2022వ సీజన్‌లో కూడా ఆరంభ వేడుకలను బీసీసీఐ నిర్వహించలేదు. కరోనా ఉధృతి కారణంగా ఈసారి ఆరంభ వేడుకలను నిర్వహించడం లేదని బీసీసీఐ ప్రకటించింది. దీంతో వరుసగా నాలుగో సీజన్ లో కూడా ఆరంభ వేడుకలు లేకుండానే ఐపీఎల్‌ 15వ సీజన్‌ ప్రారంభమయింది.

అయితే, ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభ వేడుకలు లేనప్పటికీ ఈ కార్యక్రమంలో టోక్యో ఒలింపిక్స్‌ విజేతలను బీసీసీఐ ఘనంగా సత్కరించింది. జావెలిన్ త్రో గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాతో అలాగే రెజ్లర్ కాంస్య పతాక విజేత బజరంగ్ పూనియా రజత పతాక విజేత రవి దాహియాలను బీసీసీఐ ఘనంగా సన్మానించింది. వీరితో పాటుగా వెయిట్ లిఫ్టర్ రజత పతాక విజేత మీరాబాయి చాను బాక్సర్ కాంస్య పతాక విజేత లవ్లీనా అలాగే షట్లర్‌
కాంస్య పతాక విజేత పీవీ సింధు వీరితో పాటుగా కాంస్యం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు సభ్యులను ఈ కార్యక్రమంలో బీసీసీఐ సత్కరించింది​.

Exit mobile version