Dhoni Big Statement: ప్రపంచం అంతమైపోదు కదా… ప్లే ఆఫ్ అవకాశాలపై ధోనీ కామెంట్స్

ఐపీఎల్ 15వ సీజన్ లో 55 మ్యాచ్ లు పూర్తయినా ఇప్పటికీ ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్ చేరలేదు. కేవలం ముంబై మాత్రమే ప్లే ఆఫ్ రేసు నుంచీ తప్పుకోగా మిగిలిన జట్లకు అవకాశాలు ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - May 9, 2022 / 02:44 PM IST

ఐపీఎల్ 15వ సీజన్ లో 55 మ్యాచ్ లు పూర్తయినా ఇప్పటికీ ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్ చేరలేదు. కేవలం ముంబై మాత్రమే ప్లే ఆఫ్ రేసు నుంచీ తప్పుకోగా మిగిలిన జట్లకు అవకాశాలు ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా సాంకేతికంగా రేసులో ఉంది. ఈ నేపద్యంలో చెన్నై ప్లే ఆఫ్ చేరుతుందా అన్న దాని పై అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఆదివారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై భారీ తేడాతో విజయాన్ని అందుకున్నది. ఈ నేపథ్యంలో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలను గురించి ధోనీని అడగ్గా అతడు వ్యంగ్యంగా సమాధానం చెప్పడం చర్చనీయాంశం మారింది.

ఈ విజయం అనంతరం ధోనీ మాట్లాడుతూ ప్లే ఆఫ్స్ కు చేరుతామా లేదా అనేది తాను పట్టించుకోవడం లేదని, ఐపీఎల్ ను ఎంజాయ్ చేయడంపై నే దృష్టిపెట్టినట్లు తెలిపారు. ప్లేఆఫ్ లెక్కల గురించి తనకు తెలియదని, మ్యాథ్స్ తన ఫేవరేట్ సబ్జెక్ట్ కాదని, స్కూల్ లో తాను మ్యాథ్స్ లో పూర్ అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో తమ బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా రాణించారని ధోనీ పేర్కొన్నాడు. ఇలాంటి అద్భుతమైన విజయాల్ని గత మ్యాచ్ లలో అందుకుంటే టీమ్ పరిస్థితి మరోలా ఉండేదన్నాడు. సిమర్ జీత్, ముకేష్ చౌదరి బౌలింగ్ లో పరిణతి కనిపిస్తుందన్నాడు.

ప్లేఆఫ్స్ గురించి ఆలోచించకుండా తదుపరి మ్యాచ్ లో గెలుపుపైనే దృష్టిపెట్టామని చెప్పుకొచ్చాడు. ఒకవేళ ప్లేఆఫ్స్ కు మేము వెళ్లకపోయినా నష్టపోయేది ఏమీ ఉండదని, ఇక్కడితోనే ప్రపంచం అంతరించిపోదని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. ఆదివారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కాన్వే తో పాటు మిగిలిన బ్యాట్స్ మెన్ మెరుపులతో చెన్నై 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది. ఛేదనలో సన్ రైజర్స్ 107 పరుగులకే కుప్పకూలింది.