Site icon HashtagU Telugu

Lucknow Super Gaints : లక్నో సూపర్ జెయింట్స్ లోగో ఆవిష్కరణ

Lucknow Super Gaints

Lucknow Super Gaints

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ లోగోను ఆవిష్కరించింది. అత్యున్నత శిఖరాలకు ఎగరడం కోసం.. లక్నో సూపర్‌ జయింట్స్‌ రెక్కలు విప్పేందుకు అద్భుతం కోసం సిద్ధంగా ఉండండి అంటూ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది ఫ్రాంచైజీ . ఇది చూసిన ఫ్యాన్స్‌.. లోగో అదిరిపోయిందంటూ రీ ట్వీట్‌ చేస్తున్నారు. లోగోలో భారత త్రివర్ణ పతాకంలోని మూడు రంగులతో గరుడ పక్షి రెక్కలు ఉండగా.. దానిపై నీలి రంగులో ఫ్రాంచైజీ పేరు, బ్యాట్ ఉంది. రెక్కల మధ్యలో బ్యాట్ ఉండగా దానిపై ఆరెంజ్ కలర్ సీమ్‌తో ఎర్రటి బంతి ఉంది. లోగోలోని గరుడ పక్షి రెక్కలు జట్టు ప్రేరేపిస్తుందని, మూడు రంగులు దేశం మొత్తం జట్టును సూచిస్తుందని ఫ్రాంచైజీ పేర్కొంది. కాగా.. లక్నో సూపర్ జెయింట్ జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు. రూ. 17 కోట్లతో అతడిని సొంతం చేసుకుంది. అలాగే, మార్కస్ స్టోయినిస్‌ను రూ. 9.2 కోట్లు, రవి బిష్ణోయ్‌ను రూ. 4 కోట్లకు ఎల్ఎస్‌జీ సొంతం చేసుకుంది. కోచ్‌గా ఆండీ ఫ్లవర్‌ను ఎంచుకోగా, టీమిండియా మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఇక ఐపీఎల్ ఆటగాళ్ళ మెగా వేలం ఈ నెల 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనుంది

 

Exit mobile version