IPL 2022 : ఫాస్టెస్ట్ బాల్ నీదా.. నాదా ?

ఐపీఎల్‌ 2022 సీజన్‌ రెండో అర్ధ భాగం మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ బిగ్ ఫైట్‌ జరుగనుంది.

  • Written By:
  • Publish Date - April 27, 2022 / 06:30 PM IST

ఐపీఎల్‌ 2022 సీజన్‌ రెండో అర్ధ భాగం మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ బిగ్ ఫైట్‌ జరుగనుంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో మూడో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ లో అందరి కళ్ళు ఇద్దరి మీదే నెలకొన్నాయి.. సన్ రైజర్స్ స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్, గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్‌ నువ్వా నేనా అన్న రీతిలో పోటీపడనున్నారు. వీరిద్దరిలో ఐపీఎల్ 2022 సీజన్ ఫాస్టెస్ట్ బౌలర్ ఎవరో ఈ మ్యాచ్ తో తేలనుంది. లాకీ ఫెర్గూసన్ ఈ సీజన్ లో 153.90 కిమీ వేగంతో బంతిని సందించగా.. ఉమ్రాన్ మాలిక్ 153.30 కిమీ వేగంతో బంతిని సంధించాడు. ఈ క్రమంలో ఈ రోజు మ్యాచ్ లో ఎవరు అత్యధిక వేగంతో బంతిని విసురుతారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 2022 లో వేగవంతమైన టాప్-5 డెలివరీల జాబితాను పరిశీలిస్తే.. 153.90 కిమీ వేగంతో లాకీ ఫెర్గూసన్ అగ్రస్థానంలో ఉండగా.. 153.30 కిమీ వేగంతో ఉమ్రాన్ మాలిక్ రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే 153.10 వేగంతో ఉమ్రాన్ మాలిక్ మూడో స్థానంలో ఉండగా 152.60 కిమి వేగంతో లాకీ ఫెర్గూసన్ నాలుగో స్థానంలో 152.60 కిమీ వేగంతో ఉమ్రాన్ మాలిక్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే సీజన్‌ తొలి భాగంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుదే పైచేయిగా నిలిచింది. దీంతో ,ఎల్ నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని గుజరాత్ టైటాన్స్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.