IPL Sixes: ఐపీఎల్ చరిత్రలో సిక్సర్ల రికార్డ్

రసవత్తరంగా సాగుతున్న ఈ ఐపీఎల్ సీజన్ ను అభిమానులు ఎప్పటిలాగే ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్​ ఐపీఎల్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డు సాధించింది.

  • Written By:
  • Updated On - May 17, 2022 / 01:25 PM IST

రసవత్తరంగా సాగుతున్న ఈ ఐపీఎల్ సీజన్ ను అభిమానులు ఎప్పటిలాగే ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్​ ఐపీఎల్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డు సాధించింది. ఐపీఎల్ హిస్టరీలోనే ఒక సీజన్​లో అత్యధిక సిక్సర్లు సాధించిన రికార్డును ఐపీఎల్​ 2022 సీజన్ తన ఖాతాలో లో వేసుకుంది. ఇక అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు భారత క్రికెటర్లు కూడా సిక్సర్లతో చెలరేగడమే ఈ సీజన్లో ఎక్కువ సిక్సులు రావడానికి కారణమని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఐపీఎల్ 15వ సీజన్​లో వివిధ జట్లకు చెందిన ఆటగాళ్లందరూ ఇప్పటివరకు 884 సిక్సర్లు బాదారు. అంతకుముందు ఐపీఎల్ 2018 సీజన్ లో అత్యధికంగా 872 సిక్సర్లు బాదారు. ఈ జాబితాలో ఇక 784 సిక్సులతో ఐపీఎల్ 2019వ సీజన్ మూడో స్థానంలో ఉండగా… 734 సిక్సులతో ఐపీఎల్ 2020 సీజన్ రెండో స్థానంలో , అలాగే 731 సిక్సులతో ఐపీఎల్ 2012 సీజన్ మూడో స్థానంలో నిలిచింది. అలాగే ఈ సీజన్ లో అత్యధిక దూరం సిక్స్ కొట్టిన ఆటగాడిగా పంజాబ్‌ కింగ్స్‌ విధ్వంసకర వీరుడు లియామ్ లివింగ్‌స్టోన్ నిలిచాడు. గుజరాత్‌ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో లివింగ్‌స్టోన్ 117 మీటర్ల భారీ సిక్స్‌ర్ బాదాడు. అలాగే ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ రెండో స్థానంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో డెవాల్డ్ బ్రెవిస్ 108 మీటర్ల సిక్సర్ బాదాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ దశలో మరో 6 మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. అయితే ప్లేఆఫ్స్‌ బెర్తుల్లో గుజరాత్‌ మాత్రమే ఇప్పటి వరకు ఖాయం చేసుకుంది. ఇక మిగిలిన మూడు స్థానాల కోసం 7 జట్లు పోటీపడుతున్నాయి.