IPL 2022: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ వార్నింగ్

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది.

Published By: HashtagU Telugu Desk
Hardik Pandya

Hardik Pandya

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. వాస్తవానికి ఐపీఎల్ ఆరంభానికి ముందు ప్లేయర్లు అంతా కలిసి ఫ్రాంఛైజీలు ఏర్పాటు చేసే క్యాంపుల్లో పాల్గొంటూ బిజీగా ఉంటారు. అయితే ఈసారి మాత్రం బీసీసీఐ రూటు మార్చింది. 74 రోజుల పాటు సాగే సుదీర్ఘ లీగ్ కావడం, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కూడా ఉండడంతో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ పూర్తి శ్రద్ధ పెట్టింది.

ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2022లో ఆడతాడా లేదా అనేది మరో 2 రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం పాండ్యా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. అక్కడ అతను మరో రెండు రోజుల్లో ఫిట్‌నెస్ పరీక్షలో పాల్గొంటాడు. ఈ టెస్టులో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే ఐపీఎల్ ఆడగలడు. ఒకవేళ విఫలమైతే మాత్రం ఐపీఎల్ 2022లో పాల్గొనేందుకు అనుమతి ఉండకపోవచ్చు.అయితే ఈ టెస్ట్ సమయంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే హార్దిక్.. తన జట్టు కోసం పూర్తి ఫిట్‌నెస్‌తో బౌలింగ్ చేయడానికి అనుమతి లభిస్తుందా లేదా అనేది కూడా తేలనుంది. ఇప్పుడు హార్దిక ఫ్యాన్స్ కు ఇదే భయం పట్టుకుంది. ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్న తరుణంలో హార్దిక్ ఫెయిల్ అయితే పరిస్థితేంటి అన్న కలవరం అభిమానుల్లో మొదలైంది.
ఇకపోతే హార్దిక్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు మార్చి 28న లక్నో సూపర్‌జెయింట్స్‌తో తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది.

  Last Updated: 15 Mar 2022, 05:52 PM IST