Site icon HashtagU Telugu

IPL 2022 Auctions: వేలంలో సన్ రైజర్స్ వ్యూహమిదే

Ipl Auction

Ipl Auction

ఐపీఎల్‌ 2022 మెగా వేోలం శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు బెంగళూరు వేదికగా జరగనుంది. ఈ మెగా వేలంలో చాలా మంది స్టార్ క్రికెటర్లు పాల్గొన‌బోతున్నారు. మొత్తం 590 మంది క్రికెటర్లతో బీసీసీఐ తుది జాబితాను కూడా విడుదల చేసింది. పలు ఫ్రాంచైజీలు చాలా మంది స్టార్ క్రికెటర్లను రిటైన్ చేసుకోకుండా వేలంలోకి వదిలేయడంతో ఈ సారి జరగనున్న ఆక్షన్ పై ఎనలేని ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అన్ని ఫ్రాంచైజీలు తమ తమ వ్యూహాలతో సన్నద్ధమయ్యాయి. గత సీజన్ లో నిరాశపరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సారి వేలంలో జట్టు తుది కూర్పు కోసం వ్యూహాత్మకంగా బరిలోకి దిగుతోంది. రిటెన్షన్ ప్రక్రియలో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పాటు ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్‌లను మాత్రమే తీసుకున్న సన్‌రైజర్స్ కేవలం రూ,22 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ దగ్గర రూ. 68 కోట్లు ఉన్నాయి. అత్యధిక పర్స్ మనీ కలిగిన రెండో జట్టుగా సన్‌రైజర్స్ మెగా వేలంలో బరిలోకి దిగనుంది…

ఈ మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌ ఐదుగురు విదేశీ స్టార్ ప్లేయర్స్ ను కొనుగోలు చేయాలని భావిస్తోంది.. ఓపెనింగ్ స్లాట్ కోసం ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టోతో పాటు న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ డేవాన్ కాన్వేలను తీసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. ఇక మిడిలార్డర్‌లో కేన్ విలియంసన్ కు బ్యాకప్‌గా, వికెట్ కీపర్‌గా నికోలస్ పూరన్‌ను కొనుగోలు చేయాలనుకుంటుంది… వీరితో పాటుగా ఇంగ్లాండ్ టీ 20 స్పెషలిస్ట్ బ్యాటర్ డేవిడ్ మలన్ అలాగే ఆల్‌రౌండర్‌ కోటాలో విండీస్ ఆటగాడు జాసన్ హోల్డర్‌ను కొనుగోలు చేయాలనీ హైదరాబాద్ ఫ్రాంచైజీ భావిస్తోంది… ఇక పేసర్ల విభాగంలో ప్యాట్ కమిన్స్, ట్రెంట్ బౌల్ట్, కగిసో రబడాలలో ఒక్కర్ని దక్కించుకోవాలని సన్ రైజర్స్ యాజమాన్యం భావిస్తుండగా….స్పిన్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలనుకుంటున్నట్టు సమాచారం. రషీద్ ఖాన్ ను రిటైన్ చేసుకోకపోవడంతో అతను స్థానాన్ని భర్తీ చేయగల స్పిన్నర్ ను తీసుకోవడం కష్టమే. మొత్తం మీద పూర్తి స్థాయి జట్టును సన్నద్ధం చేసుకునే క్రమంలో సన్ రైజర్స్ యువక్రికెటర్ల పైనా దృష్టి పెడితే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Exit mobile version