Site icon HashtagU Telugu

IPL 2022 Auction: మెగా వేలంలో గబ్బర్ గర్జన

Sikhar Dhawan

Sikhar Dhawan

ఐపీఎల్ 2022 మెగా వేలం బెంగళూరు వేదికగా జరుగుతొంది ఈ వేలంలో 590 మంది ఆట‌గాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.. అయితే ఐపీఎల్‌ 2022 మెగావేలం సందర్భంగా వేలంలోకి తొలి ఆటగాడిగా శిఖర్‌ ధావన్‌ వచ్చాడు. అతని కోసం పంజాబ్‌ కింగ్స్‌ , ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య భారీ పోటీ నెలకొంది. ఇక ధావన్‌ కనీస ధర. రూ.2 కోట్లతో ఈసారి వేలంలో బరిలోకి దిగాడు.రూ.8.25 కోట్లతో పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకుంది. నిజానికి ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ప‌ని అయిపోయింది..ఇక భార‌త జ‌ట్టులో చోటు క‌ష్ట‌మే, అత‌డి స్ధానంలో కుర్రాళ్లకు అవ‌కాశం ఇవ్వండి…ఇవ‌న్నీ ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు ముందు వినిపించిన మాటలు ఇవి. అయితే ప‌డి లేచిన కెర‌టంలా ధావ‌న్ ద‌క్షిణాఫ్రికా టూర్‌లో అద్భుతంగా రాణించాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 169 ప‌రుగులు సాధించాడు. దీంట్లో రెండు అర్ధ‌సెంచ‌రీలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సిరీస్‌లో టీమిండియా త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా ధావ‌న్‌ నిలిచాడు. అలాగే గ‌త ఏడాది శ్రీలంక పర్యటనలో భారత యువ జట్టుకు శిఖర్‌ ధావన్‌ సారథ్యం వహించాడు. టీ20 ప్రపంచకప్‌-2021, స్వదేశాన న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా ధావన్‌కు చోటు దక్కలేదు. ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలంకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ధావ‌న్‌ని రీటైన్ చేసుకోలేదు.