ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. ఇప్పటివరకు ఒకే జట్టుకు కలిసి ఆడిన కొందరు…ఇకపై ప్రతర్డులుగా మారిపోతున్నారు. పాత జట్టును వీడే క్రమంలో కృతజ్ఞతలు చెబుతున్నారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన డుప్లెసిస్ యెల్లో ఆర్మీకి థాంక్స్ చెబుతూ ఒక వీడియో పోస్ట్ చేశాడు.
💔#SuperKingForever @faf1307 pic.twitter.com/rt3MUcOD4o
— Chennai Super Kings (@ChennaiIPL) February 13, 2022
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తనతో కలిసి ప్రయాణించినందుకు వెటరన్ దక్షిణాఫ్రికా ప్లేయర్ డుప్లెసిస్ జట్టుకు, మేనేజ్మెంట్ కు థ్యాంక్స్ చెప్పాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7కోట్లకు డుప్లెసిస్ ను కొనుగోలు చేసింది. దీంతో ఈ సీజన్ నుంచీ ఆర్సీబీతో తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభించనున్నాడు.ఈ నేపద్యంలో 2011 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తో చేసిన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ వీడియో ట్వీట్ చేశాడు. 2016, 2017సీజన్లలో చెన్నైను నిషేదించడంతో సీఎస్కేకు దూరమయ్యాడు. చెన్నై, జట్టు అభిమానులు, స్టాఫ్, మేనేజ్ మెంట్, తనకు చాలా జ్ఞాపకాలను ఇచ్చారన్నాడు. వారికి థ్యాంక్యూ చెప్పడం చాలా ముఖ్యమనీ, ఇన్నేళ్ల జర్నీ చాలా ఎంజాయ్ చేశాననీ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరినీ మిస్ అవుతా అంటూ డుప్లెసిస్ చెప్పిన వీడియోను సీఎస్కే ట్విట్టర్ లో పోస్టు చేసింది.