IPL 2022 Auction : మెగా వేలంలో అహ్మదాబాద్ టార్గెట్ వీరే

ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జట్లలో అహ్మదాబాద్ ఒకటి. వేలానికి ముందే ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ను జట్టులోకి తీసుకుంది.

  • Written By:
  • Updated On - February 4, 2022 / 12:47 PM IST

ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జట్లలో అహ్మదాబాద్ ఒకటి. వేలానికి ముందే ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ను జట్టులోకి తీసుకుంది. టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించిన ఆ ఫ్రాంచైజీ రషీద్ ఖాన్, శుభమన్ గిల్ లను ఎంపిక చేసుకుంది. ఈ ముగ్గురి ఎంపిక వెనుక టీమిండియా మాజీ కోచ్ , సౌతాఫ్రికా దిగ్గజం గ్యారీ కిరిస్టెన్ ఉన్నాడు. తాజాగా మెగా వేలంలో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం భారీ వ్యూహమే సిద్ధం చేశాడు. కొత్త ఫ్రాంచైజీకి నెహ్రా ప్రధాన కోచ్ గా ఉంటే…కిరిస్టెన్ మెంటార్ గా బాధ్యతలు చేపట్టాడు. కాగా వేలంలో కొందరు స్టార్ ప్లేయర్స్ ను తీసుకోవాలని కిరిస్టెన్ ఇప్పటికే ఫ్రాంచైజీకి సూచించాడు. కిరిస్టెన్ సూచించిన జాబితాలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ , పేసర్ జోఫ్రా ఆర్చర్ , స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఉన్నారు. అహ్మదాబాద్ జట్టులో ప్రస్తుతం వికెట్ కీపింగ్ ప్లేస్ ఖాళీగా ఉంది. వేలంలో మాథ్యూ వేడ్ ను దక్కించుకోవాలని కిరిస్టెన్ భావిస్తున్నాడు. ఆసీస్ జట్టు తరపునే కాకుండా, బిగ్ బాష్ లీగ్ లోనూ దుమ్ము రేపిన వేడ్ ఖచ్చితంగా తమ టీమ్ కు అడ్వాంటేజ్ అవుతాడని గ్యారీ అంచనా వేస్తున్నాడు. బిగ్ బాష్ లో వేడ్ ప్రాతినిథ్యం వహించిన హోబార్ట్ హరికేన్స్ జట్టుకే కిరిస్టెన్ కోచ్ గా పని చేశాడు. అతని ఆటతీరును గత నాలుగేళ్ళుగా దగ్గర నుండి చూస్తున్న కిరిస్టెన్ వేలంలో వేడ్ ను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వేడ్ మంచి వికెట్ కీపరే కాదు టీమ్ కు మంచి ఫినిషర్ కూడా. గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో వేడ్ ఫినిషర్ రోల్ ను సక్సెస్ ఫుల్ గా పోషించాడు.

ఇక కిరిస్టెన్ టార్గెట్ చేసిన మరో ఆటగాడు ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్. నిజానికి గాయం కారణంగా అసలు ఈ సీజన్ లో ఆర్చర్ ఆడే అవకాశం లేదు. అయితే వచ్చే రెండు సీజన్లకూ అందుబాటులో ఉంటానని ప్రకటించిన ఆర్చర్ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. దీంతో ఆర్చర్ కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తాయి. గతంలో కిరిస్టెన్ కోచ్ గా పనిచేసిన హోబార్ట్ హరికేన్స్ కు ఆడిన ఆర్చర్ 2017 బిగ్ బాష్ లీగ్ సీజన్ లో 11 వికెట్లు పడగొట్టాడు. అటు భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ను కూడా తీసుకోవాలని కిరిస్టెన్ భావిస్తున్నాడు. జట్టులో రషీద్ ఖాన్ స్పిన్నర్ గా ఉన్నప్పటకీ… చాహల్ బౌలింగ్ శైలి మరో విధంగా ఉంటుందని గ్యారీ చెబుతున్నాడు. గత 8 సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన చాహల్ తన ఫ్లైటెడ్ డెలివరీలతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందిపెడతాడు. దీంతో ఈ ముగ్గురినీ వేలంలో దక్కించుకుంటే టీమ్ కాంబినేషన్ బ్యాలన్స్ అవుతుందని కిరిస్టెన్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి సూచించాడు.