Site icon HashtagU Telugu

IPL 2022: గిన్నిస్ బుక్ లో ఐపీఎల్ 2022 ఫైనల్

Ipl Recordj

Ipl Recordj

ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెర తీసిన ఐపీఎల్ కు గిన్నిస్ బుక్ లో చోటు దక్కింది. ఈ ఏడాది మే 29న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు ఈ పురస్కారం లభించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మోతేరా స్టేడియం వేదికగా ఈ ఫైనల్ కి రికార్డు స్థాయిలో 101, 566 మంది హాజరయ్యారు. ఓ క్రీడా ఈవెంట్‌కు ఇంతమంది హాజరుకావడం ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్ కు గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కింది. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్లే గుర్తించి బీసీసీఐకి అవార్డు అందజేశారు.

ఈ అవార్డు అందుకోవడంపై బీసీసీఐ సెక్రటరీ జైషా సంతోషం వ్యక్తం చేశాడు. చాలా గర్వంగా ఉందని ట్వీట్ చేశాడు. గతంలో అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియం సీటింగ్ కెపాసిటీ 49 వేలు మాత్రమే ఉండేది. అయితే స్టేడియాన్ని ఆధునీకరణ చేసిన తర్వాత లక్షా 32 వేలకు సీటింగ్ కెపాసిటీని పెంచారు. ఇదిలా భారత్‌ గిన్నిస్ రికార్డు సృష్టించడం ప్రతీ ఒక్కరికి గర్వకారణమనీ, అభిమానులు ఇచ్చిన తిరుగులేని మద్దతుకు లభించిన పురస్కారం. అందరికి అభినందనలని బీసీసీఐ ట్వీట్ చేసింది.

Exit mobile version