Site icon HashtagU Telugu

IPL 2022 : వస్తున్నాడు మరో డివీలియర్స్

D Villiars Son

D Villiars Son

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, ఆర్‌సీబీ విద్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుని అభిమానులకు షాక్‌కు గురి చేసాడు. మరే ఆటగాడికీ సాధ్యం కాని 360 డిగ్రీల షాట్లు ఆడడమే డివీలియర్స్ ను వరల్డ్ క్రికెట్ లో ప్రత్యేకంగా నిలబెట్టింది. బౌలర్ బంతి ఎలా వేసినా తనదైన వెరైటీ షాట్లతో బౌండరీకి తరలిస్తూ ఉంటాడు ఏబీ. అయితే రిటైర్మెంట్ నిర్ణయంతో ఇక ఆ షాట్లు చూడలేమని చాలా మంది ఫ్యాన్స్ నిరాశ చెందారు. అలాంటి ఫ్యాన్స్ కు ఉత్సాహాన్నిచ్చే వార్త.ఐపీఎల్ 2022 సీజన్ లో డివిలియర్స్‌ విధ్వంసం మళ్లీ చూసే ఛాన్స్ వచ్చింది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ అనే యువ ఆటగాడు ప్రస్తుతం అండర్‌-19 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా తరపున దుమ్మురేపుతున్నాడు.

మైదానం నలువైపులా 360 డిగ్రీస్‌లో షాట్లు కొడుతూ అచ్చం ఏబీ డివిలియర్స్‌ను గుర్తుచేస్తున్నాడు. ఇప్పటికే ఆడిన 2 మ్యాచ్‌ల్లో 169 పరుగులు చేసిన డెవల్డ్ బ్రెవిస్‌ ఒక సెంచరీ చేశాడు. తొలుత ఉగాండాతో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన బ్రెవిస్‌.. భారత్ తో జరిగిన మ్యాచ్ లో అర్థ శతకంతో రాణించాడు. అనంతరం వెస్టిండీస్‌ తో జరిగిన మ్యాచ్ లో మరో ఆఫ్ సెంచరీ సాధించి ప్రస్తుతం టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక ఈ టోర్నీలో అచ్చం ఏబీ డివిలియర్స్‌ను గుర్తుచేస్తూ చెలరేగుతున్న డెవల్డ్ బ్రెవిస్‌ బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న ఐపీఎల్‌ మెగావేలంలో పాల్గొనే అవకాశం ఉంది… ఒకవేళ అదే బ్రెవిస్‌ ఐపీఎల్ వేలానికి వస్తే మాత్రం ఆర్సీబీ కచ్చితంగా కొనుగోలు చేసి డివిలియర్స్ లేని లోటును భర్తీ చేసుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.