Site icon HashtagU Telugu

IPL 2022 : ఐపీఎల్ మెగా వేలం ఫైనల్ లిస్ట్ ఇదే

Tata Ipl

Tata Ipl

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్‌ మెగావేలానికి ఇంకా 10 రోజుల సమయమే ఉండటంతో ఫ్రాంచైజీలు తమ వ్యూహాల జోరును పెంచాయి. ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఈ మెగా ఆక్షన్ జరగనుండగా1214 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. అయితే వీరిలో 590 మంది ఆటగాళ్లు మాత్రమే మెగా వేలానికి ఎంపికైనట్లు బీసీసీఐ ప్రకటించింది.వీరిలో టీమిండియా నుంచిఇషాన్ కిషన్, శ్రేయస్‌ అయ్యర్‌, శిఖర్‌ ధావన్‌, రవిచంద్రన్ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహర్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌ మహ్మద్‌ షమీ,, అజింక్య రహానే, సురేశ్‌ రైనా, యజువేంద్ర చహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు… అలాగే పాట్‌ కమిన్స్‌, డేవిడ్ వార్నర్‌, డికాక్‌, డు ప్లెసిస్‌, రబాడ, ఎవిన్‌ లూయిస్‌, ఫించ్‌, బెయిర్‌స్టో, మోర్గన్‌, డేవిడ్‌ మలాన్‌, హెట్‌మయిర్, పూరన్‌ వంటి విదేశీ ఆటగాళ్లున్నారు. మరోవైపు ‘మర్కీ ప్లేయర్స్‌’ జాబితాను కూడా బీసీసీఐ ప్రకటించింది. ‘‘బిగ్‌ నేమ్స్‌ ఎట్‌ మెగా ఆక్షన్‌’’ పేరిట వేలంలో పాల్గొనబోయే స్టార్‌ ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. ఇందులో టీమిండియా సీనియర్‌ ఆటగాడు, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ముందు వరుసలో నిలిచాడు. అతడితో పాటు మహ్మద్‌ షమీ, ఫాఫ్‌ డుప్లెసిస్‌, డేవిడ్‌ వార్నర్‌, ప్యాట్‌ కమిన్స్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, క్వింటన్‌ డికాక్‌, కగిసో రబడ, ట్రెంట్‌ బౌల్ట్‌లకు మార్కీ ప్లేయర్ల జాబితాలో చోటు దక్కింది.

Exit mobile version