Site icon HashtagU Telugu

Cricket In Olympics :  2028 ఒలింపిక్ గేమ్స్ లో టీ20 క్రికెట్ .. ఐఓసీ గ్రీన్ సిగ్నల్

LA28 Olympics

LA28 Olympics

Cricket In Olympics :  క్రికెట్ కు అరుదైన గౌరవం దక్కింది. 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ క్రికెట్ ను ఒలింపిక్ గేమ్స్ స్పోర్ట్స్ ఈవెంట్స్ లిస్టులో చేర్చారు. సోమవారం ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)  సెషన్‌లో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. టీ20 ఫార్మాట్ క్రికెట్ తో పాటు బేస్ బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోస్‌ లను కూడా ఈవెంట్స్ జాబితాలో చేర్చామని IOC వెల్లడించింది. 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌ వేదికగా జరిగే  ఒలింపిక్ గేమ్స్ లో వీటన్నింటికీ చోటు లభిస్తుందని తెలిపింది. దీంతో కొత్తగా ఐదు స్పోర్ట్స్ ఈవెంట్స్ ఒలింపిక్స్ లో చేరినట్టయింది.

We’re now on WhatsApp. Click to Join.

2028లో ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చే దేశంగా అమెరికా క్రికెట్ టీమ్ రంగంలోకి దిగుతుందా ? దిగదా ? అనే దానిపై ఇంకా ప్రకటన వెలువడలేదు. ఒలింపిక్స్ లో ఎన్ని టీమ్స్ పాల్గొంటాయి ? క్వాలిఫైయింగ్ మ్యాచ్ లను ఎలా నిర్వహిస్తారు ? అనే దానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. చివరిగా 1900 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలను నిర్వహించారు.  ఆదాయాన్ని పెంచుకునే వ్యూహంతోనే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ.. ఈవెంట్స్ లోకి టీ20 క్రికెట్ ను చేర్చిందని అంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారు మార్కెట్ కలిగిన భారత్ వంటి దేశాల్లో అద్భుతమైన క్రేజ్ కలిగిన టీ20 క్రికెట్ ను ఒలింపిక్ గేమ్స్ లో చేర్చడం వల్ల ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి కాసుల వర్షం కురుస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

Also Read: 100 Days – 150 Crores : 100 రోజుల్లో 150 కోట్ల ఆదాయమే టార్గెట్.. ఆర్టీసీ ప్లాన్ ఇదీ