Site icon HashtagU Telugu

IOA President PT Usha: మెడిక‌ల్ బృందాన్ని త‌ప్పు ప‌ట్ట‌డం స‌రికాదు: పీటీ ఉష

IOA President PT Usha

IOA President PT Usha

IOA President PT Usha: పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్ 100 గ్రాముల అధిక బ‌రువు కార‌ణంగా టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన విష‌యం తెలిసిందే. దీనిపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ‌స్తున్నాయి. అయితే చాలా మంది భారత ప్ర‌ముఖులు వినేష్‌కు మ‌ద్దతుగా నిలుస్తున్నారు. కనీసం వినేష్‌కు ర‌జ‌త ప‌త‌కం అయిన ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే ఈ విష‌యంపై తాజాగా భార‌త ఒలింపిక్ సంఘం అధ్య‌క్షురాలు పీటీ ఉష (IOA President PT Usha) స్పందించారు.

అధిక బ‌రువు వ‌ల్ల రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్‌ను పారిస్ ఒలింపిక్స్ ఫైన‌ల్లో అన‌ర్హ‌త‌కు గురిచేసిన విష‌యం తెలిసిందే. ఈ అంశంపై భార‌త ఒలింపిక్ సంఘం అధ్య‌క్షురాలు పీటీ ఉష‌ స్పందించారు. బరువును ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే బాధ్య‌త అథ్లెట్ల‌దే అని పీటీ ఉష‌ తెలిపారు. మెడిక‌ల్ బృందాన్ని తప్పుపట్ట‌డం సరికాదని ఆమె అన్నారు. చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ దిన్‌షా ప‌ర్దివాలాను నిందించడం సమంజసంగా కాదు. అథ్లెట్లు, వాళ్ల కోచ్‌లు ఈ బాధ్య‌తను తీసుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు.

Also Read: Neeraj Chopra: నీరజ్ చోప్రా ద‌గ్గ‌ర ఉన్న కార్లు ఇవే.. రేంజ్ రోవ‌ర్‌తో పాటు..!

వినేశ్ ఫోగ‌ట్‌ను 50 కేజీల ఫ్రీ స్ట‌యిల్ రెజ్లింగ్ మ్యాచ్ ఫైన‌ల్‌కు ముందు వంద గ్రాముల అధిక బ‌రువు ఉన్నందున ఒలింపిక్ నిర్వాహ‌కులు ఆమెను డిస్‌క్వాలిఫై చేశారు. ఈ కారణంగా భారతదేశానికి ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ గోల్డ్ అందుకునే అవకాశం కోల్పోయింది. ఈ ఘటనపై కొన్ని నిందారోపణలు ఉన్నాయి. పార్లమెంట్‌లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. టీమ్ డాక్ట‌ర్ పర్దివాలా నిర్లక్ష్యంతో ఈ సమస్య ఏర్పడిందని ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పీటీ ఉష పైవిధంగా స్పందించారు. ఎవ‌రీ బ‌రువు బాధ్య‌త వారే చూసుకోవాల్సి ఉంటుంద‌ని అన్నారు. పారిస్ క్రీడలకు వెళ్లే ప్రతి భారతీయ అథ్లెట్‌కు సపోర్టు టీమ్ ఉంటుంది. ఆ టీమ్ వ‌ద్దే అథ్లెట్లు శిక్షణ పొందుతుంటారు. ఈ బృందాలు ఎన్నో ఏళ్ల నుండి ఉన్నాయ‌ని పీటీ ఉష చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే పారిస్‌లో నిర్వ‌హించిన ఒలింపిక్స్‌లో భార‌త్ 6 ప‌తకాలు మాత్ర‌మే సాధించింది. ఇందులో ఒక ర‌జ‌త ప‌త‌కం ఉండ‌గా.. 5 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి. ఇందులో షూట‌ర్ మ‌ను భాక‌ర్ రెండు కాంస్య ప‌త‌కాలు, నీర‌జ్ చోప్రా ర‌జ‌త ప‌త‌కం ఉన్న విష‌యం తెలిసిందే. ఒలింపిక్స్ ప‌త‌కాల ప‌ట్టిక‌లో యూఎస్ఏ మొత్తం 126 ప‌త‌కాల‌తో మొద‌టి స్థానంలో ఉండ‌గా.. చైనా 91 ప‌త‌కాల‌తో రెండో స్థానంలో నిలిచింది. భార‌త్ ఆరు ప‌త‌కాల‌తో 71వ స్థానంలో నిలిచింది.