Yuvraj Singh: యువరాజ్ సింగ్ ఇంట్రస్టింగ్ పోస్ట్.. ట్వీట్ వైరల్

  • Written By:
  • Publish Date - June 28, 2024 / 10:13 PM IST

Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశాడు. అందులో ఏముందంటే? “టీమిండియా ప్లేయర్లు బాగా ఆడారు. బామ్మర్ధులూ గుడ్ నైట్” అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు. దాంతో ఈ ట్వీట్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే యువీ అలా ఇంగ్లండ్ ప్లేయర్లను బామ్మర్ధులు అనడానికి కారణం లేకపోలేదు.

యువరాజ్ సింగ్ బ్రిటీష్ మోడల్ అయిన హేజిల్ కిచ్ ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆమె ఇంగ్లండ్ లోని ఎస్సెక్స్ లో జన్మించింది. దాంతో ఆ దేశంతో యువరాజ్ కు బంధుత్వం ఏర్పడింది. ఆ దేశం అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టి.. ఆటగాళ్లను అలా సంభోదించాడు. ఇక ఈ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో.. నీ ప్రజెంట్ ఆఫ్ మైండ్ కు సలామ్ అంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.

నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ యువీ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. టీ20 వరల్డ్ కప్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన రికార్డు ఇప్పటికీ యువీ పేరిటే ఉంది. అతడు 2007 పొట్టి ప్రపంచ కప్ లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఆరు సిక్సర్లు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.