Ambati Rayadu Injury: గాయం బారిన మరో చెన్నై ప్లేయర్

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మ్యాచ్‌కు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు భారీ షాక్ త‌గిలే అవ‌కాశం ఉంది.

Published By: HashtagU Telugu Desk
Ambati Imresizer

Ambati Imresizer

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మ్యాచ్‌కు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు భారీ షాక్ త‌గిలే అవ‌కాశం ఉంది. ఆ జ‌ట్టు స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు గాయం కార‌ణంగా మే 1న జరగనున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మ్యాచ్‌తో పాటు మ‌రి కొన్ని మ్యాచ్‌ల‌కు కూడా దూర‌మయ్యే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. ఏప్రిల్ 25న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా అంబటి రాయుడు గాయ‌ప‌డ్డాడు. దీంతో అత‌డు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తో జరగనున్న మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు.పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన అంబటి రాయుడు 39 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు.

ఆ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అంబటి రాయుడి ఆ తరువాత గాయంతోనే అతను బ్యాటింగ్ కొనసాగించాడు , దాంతో గాయం మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీజన్‌లో అంబటి రాయుడు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 35.14 సగటున 129.47 స్ట్రైక్‌ రేట్‌తో 246 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, అంబటి రాయుడుతో కలుపుకుని ఈ సీజన్‌లో గాయాల కారణంగా సీఎస్‌కేకు దూరమైన ఆటగాళ్ల సంఖ్య నాలుగుకి చేరింది. తొలుత దీపక్‌ చాహర్‌, ఆ తర్వాత ఆడమ్‌ మిల్నే, మొయిన్ అలీ గాయాల కారణంగా వైదొలిగారు.ఇదిలాఉంటే.. ఐపీఎల్ 2022 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు అంతగా కలిసి రావట్లేదు. వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోరెండింటిలో మాత్రమే గెలిచిన ఆ జట్టు పాయింట్లపట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

  Last Updated: 30 Apr 2022, 09:17 AM IST