T20 World Cup: కీలక మ్యాచ్ కోసం సంజూని దింపుతున్న రోహిత్

టి20 ప్రపంచకప్ లో రోహిత్ సేన వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఓటమెరుగని జట్టుగా తమ జర్నీ కొనసాగుతుంది.. లీగ్ దశలో అదరగొట్టిన భారత్ సూపర్ 8 లోనూ సత్తా చాటుతుంద. తొలి సూపర్ 8 మ్యాచ్ లో ఆఫ్ఘన్ ని చిత్తూ చేసిన భారత్ రెండో సూపర్8 మ్యాచ్ కోసం సిద్ధమైంది. ఈ మ్యాచ్ భారత్ కు కీలకంగా మారింది.

T20 World Cup; టి20 ప్రపంచకప్ లో రోహిత్ సేన వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఓటమెరుగని జట్టుగా తమ జర్నీ కొనసాగుతుంది.. లీగ్ దశలో అదరగొట్టిన భారత్ సూపర్ 8 లోనూ సత్తా చాటుతుంద. తొలి సూపర్ 8 మ్యాచ్ లో ఆఫ్ఘన్ ని చిత్తూ చేసిన భారత్ రెండో సూపర్8 మ్యాచ్ కోసం సిద్ధమైంది. ఈ మ్యాచ్ భారత్ కు కీలకంగా మారింది.

ఒకవైపు రన్ రేట్ పరంగా ఆసీస్ ముందంజలో ఉండగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే సెకండ్ సూపర్8 లో రోహిత్ సేన భారీ తేడాతో గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ కీలక మ్యాచ్ కోసం రోహిత్ శర్మ విధ్వంసకర ఆటగాడిని బరిలోకి దింపేందుకు సిద్దమయ్యాడు. ఈ టోర్నమెంట్ లో రవీంద్ర జడేజా, శివమ్ దూబేలు వరుసగా విఫలమయ్యారు. ఈ స్టార్ ఆల్ రౌండర్లు జట్టు విజయంలో వారి పాత్ర శూన్యంగా కనిపిస్తుంది. అలా అని వారిద్దర్నీ తక్కువ అంచనా వేసేది లేదు.. అయితే కీలక మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి కాబట్టి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదు. ఈ నెపథ్యంలో రోహిత్ వాళ్ళిద్దర్నీ సైడ్ చేయాలనీ అనుకుంటున్నాడు.

వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సూపర్-8 తొలి మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ ని తప్పించారు. అతని స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌పై కూడా రోహిత్ మార్పులు చేయనున్నాడు. అంటిగ్వా పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించే ఛాన్స్ లు ఉన్నందున జడేజా ప్లేస్ లో మహ్మద్ సిరాజ్ ను తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్ మెంట్ ఆలోచిస్తోంది.ఇక మిడిలార్డర్ లో దూబే స్థానంలో సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇవ్వనున్నారట. మిడిల్ ఆర్దర్స్లో సంజూ రాణిస్తాడని జట్టు మేనేజ్మెంట్ బలంగా నమ్ముతుంది. అటు సంజు కూడా ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. అన్ని అనుకున్నట్టు జరిగితే అంటిగ్వాలో ఈ రోజు సంజు మెరుపులు చూడొచ్చు.

Also Read: India Bangladesh Ties: డిజిటల్, ఆరోగ్యం, వైద్యం సహా బంగ్లాదేశ్ కు భారత్ సహకారం