Miracle After 41 Years : ఆసియా క్రీడల్లో భారత్ కు మూడో గోల్డ్.. గుర్రపు స్వారీలో 41 ఏళ్ల తర్వాత స్వర్ణం

Miracle After 41 Years :  41 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత్ కు ఆసియా గేమ్స్ లో గుర్రపు స్వారీ విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది.

  • Written By:
  • Publish Date - September 26, 2023 / 03:38 PM IST

Miracle After 41 Years :  41 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత్ కు ఆసియా గేమ్స్ లో గుర్రపు స్వారీ విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది. దీంతో చైనాలో ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ కు వచ్చిన గోల్డ్ మెడల్స్ సంఖ్య మూడుకు పెరిగింది. మొత్తం పతకాల సంఖ్య 14కు పెరిగింది. భారత్ కు చెందిన సుదీప్తి హజెలా, దివ్యకృతి సింగ్, హృదయ్ ఛేడా, అనుష్ అగర్వాల్‌ లతో కూడిన భారత గుర్రపు స్వారీ టీమ్ అద్భుతం చేసి బంగారు పతకాన్ని గెలుచుకుంది. చివరిసారిగా 1982 ఆసియా క్రీడలలో భారత్ కు గుర్రపు స్వారీలో గోల్డ్ మెడల్ (Miracle After 41 Years) వచ్చింది.

Also read : MLC Kavitha: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట

ఈ ఆసియా గేమ్స్ లో ఇండియా సాధించిన మెడల్స్ లిస్టును పరిశీలిస్తే.. 3 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్య పతకాలు ఉన్నాయి.ఇవాళ ఆసియా క్రీడల్లో భారత్ కు మరో 3 పతకాలను సెయిలర్లు సాధించిపెట్టారు. మహిళల డింగీ ఐఎల్ సీఏ4 ఈవెంట్ లో నేహా ఠాకూర్ రజతం సాధించగా, పురుషుల విభాగంలో ఎబాద్ అలీ కాంస్యం సాధించారు. సెయిలింగ్ లో ఆర్ఎస్-x విండ్ సర్ఫింగ్ ఈవెంట్ లో ఎబాద్ అలీ మూడో స్థానంలో నిలిచారు. పురుషుల డింగీ ఈవెంట్ లో విష్ణు శరవణన్ కాంస్యం నెగ్గాడు.