Site icon HashtagU Telugu

GS Lakshmi: ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్ కు రిఫరీగా తెలుగుతేజం

Gs Laxmi

Gs Laxmi

న్యూజిలాండ్ లో గత కొన్నివారాలుగా జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం క్రైస్ట్ చర్చ్ లో జరిగే ఫైనల్స్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తమ జాతకాలను తేల్చుకోనున్నాయి. అయితే ఈ టైటిల్ సమరానికి మ్యాచ్ రిఫరీగా తెలుగు తేజం జీఎస్ లక్ష్మీ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఏపీకి చెందిన జీఎస్ లక్ష్మీ గతంలో పురుషుల క్రికెట్లోనూ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించారు. యూఏఈ వేదికగా రెండేళ్ల కిందట జరిగిన ఐసీసీ ఈవెంట్ లోనూ ఆమె రెండు మ్యాచ్ లకు రిఫరీగా బాధ్యతలను నిర్వర్తించారు.

తద్వరా పురుషుల క్రికెట్ లో తొలి మహిళా రిఫరీగా చరిత్ర పుటల్లోకెక్కారు. రాజమండ్రికి చెందిన గండికోట సర్వలక్ష్మీ…ఓ బ్రహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి ఉద్యోగ రీత్యా ఆమె విద్యాభ్యాసం అంత కూడా జంషెడ్ పూర్ లోనే కొనసాగింది. లక్ష్మీ కళాశాల రోజుల్లోనే మంచి క్రికెటర్ గా గుర్తింపు పొందారు. దేశవాళీల్లో దక్షిణమధ్య రైల్వే, ఆంధ్రా, బీహార్, కర్నాటక, సౌత్ జోన్ జట్లకు ఆమె ప్రాతినిధ్యం వహించారు. దేశవాలీ క్రికెట్లో 18 సంవత్సరాలపాటు ఆడారు. కోచ్ గానూ వ్యవహరించిన ఆమె…ఆటకు వీడ్కోలు పలికాక..2019లో ఐసీసీ ఎలైట్ మ్యాచ్ రిఫరీల ప్యానెల్లో చోటు దక్కించుకున్నారు.

Exit mobile version