Site icon HashtagU Telugu

Gold In Badminton : ‘ఏషియన్ గేమ్స్’లో కొత్త రికార్డు.. బ్యాడ్మింటన్ లో భారత్ కు తొలి గోల్డ్

Gold In Badminton

Gold In Badminton

Gold In Badminton : ఏషియన్ గేమ్స్ చరిత్రలో తొలిసారిగా బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ కు స్వర్ణ పతకం వచ్చింది. బ్యాడ్మింటన్ డబుల్స్‌ ఫైనల్ మ్యాచ్ లో సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి జంట,  కొరియా ఆటగాళ్లు చో సోల్గూ, కిమ్ వోంగూ పై 21-18, 21-16 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు. ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ నెగ్గిన మొట్టమొదటి తొలి గోల్డ్ మెడల్ (Gold Medal) ఇదే.  అంతకుముందు ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ డబుల్స్‌లో ఫైనల్ కు చేరిన తొలి జంటగా సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి నిలిచారు.

We’re now on WhatsApp. Click to Join

బ్యాడ్మింటన్ డబుల్స్ లో సాత్విక్, చిరాగ్ శెట్టి వరల్డ్ నెంబర్ 2 ర్యాంకులో కొనసాగుతున్నారు. చైనాలోని హాంగ్జౌలో జరుగుతన్న 19వ ఏషియన్ గేమ్స్ లో వీరు సాధించిన స్వర్ణంతో భారత్ ఖాతాలో 101వ పతకం చేరింది. ప్రస్తుతం భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య 26. ఇక పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 41 ఏళ్ల తర్వాత భారత్ కు తొలి కాంస్య పతకం అందించాడు.  కబడ్డీ, క్రికెట్ విభాగాల్లోనూ భారత ఆటగాళ్లు గోల్డ్ (Gold In Badminton)  సాధించారు.

Also read :Asian Games2023: అక్టోబ‌ర్ 10న కలుద్దాం.. అథ్లెట్లతో పీఎం