U-19 Asia Cup: నేపాల్ ని వణికించిన రాజ్ లింబానీ

యువ ఆటగాళ్లు పోటీపడే అండర్-19 ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌లో భారత యువ జట్టు అద్భుతాలు చేసింది. మంగళవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది

U-19 Asia Cup: యువ ఆటగాళ్లు పోటీపడే అండర్-19 ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌లో భారత యువ జట్టు అద్భుతాలు చేసింది. మంగళవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత రాజ్ లింబానీ (7 వికెట్లు) విజృంభించడంతో నేపాల్ బ్యాట్స్ మెన్ 52 పరుగులకే కుప్పకూలారు. ఆ తర్వాత భారత బ్యాట్స్‌మెన్ స్వల్ప లక్ష్యాన్ని 7.1 ఓవర్లలోనే చేధించారు. ఈ విజయంతో టీమిండియా సెమీస్‌ బెర్త్‌ దాదాపు ఖాయం.

ఈ మ్యాచ్‌లో నేపాల్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగి వికెట్లు కోల్పోతూనే ఉంది. రాజ్ లింబానీ కారణంగా ఏ బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో 13 పరుగులే అత్యధిక స్కోరు. లింబానీ మొత్తం 9.3 ఓవర్లు బౌలింగ్ చేసి 13 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 3 మెయిడెన్ ఓవర్లు ఉన్నాయి. ఇచ్చిన 13 పరుగులలో 2 వైడ్ల రూపంలో వచ్చాయి.

అనంతరం 53 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాట్స్‌మెన్ వికెట్ నష్టపోకుండా 7.1 ఓవర్లలో చేధించారు. ఈ విజయంతో టీమిండియా సెమీస్‌ బెర్త్‌ దాదాపు ఖాయం. ఈ టోర్నీలో టీమిండియాకు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించిన యువ భారత జట్టు, రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడింది.

Also Read: CM Jagan: తెలంగాణ ప్రజాతీర్పుతో సీఎం జగన్ అలర్ట్