Site icon HashtagU Telugu

Asia Cup 2025: ముంబయి వర్షాలతో టీమ్‌ ఇండియా జట్టు ప్రకటనకు ఆటంకం

Asia Cup

Asia Cup

ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆసియా కప్‌ 2025 (Asia Cup 2025)కోసం భారత జట్టు ప్రకటన కొంత ఆలస్యమయ్యే (India’s Asia Cup 2025 Squad Announcement) అవకాశం ఉంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు జట్టు ప్రకటన జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా రోడ్లు జలమయమవడంతో విలేకరుల సమావేశం సమయానికి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే టీ20 భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ బీసీసీఐ కార్యాలయానికి చేరుకున్నా, మిగిలిన సభ్యులు హాజరు కావాల్సి ఉంది.

Indiramma Housing Scheme : గుడిసెలు లేని గ్రామంగా బెండాలపాడు

ఈ ప్రతిష్టాత్మక ఆసియా కప్‌ సెప్టెంబర్‌ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. ఈ టోర్నమెంట్‌ పూర్తిగా టీ20 ఫార్మాట్‌లో కొనసాగనుంది. అఫ్గానిస్థాన్‌, హాంకాంగ్‌ మధ్య సెప్టెంబర్‌ 9న జరిగే మ్యాచ్‌తో ఈ కప్‌ ప్రారంభం కానుంది. ఇక టీమ్‌ ఇండియా తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 10న యూఏఈ జట్టుతో ఆడనుంది. ఈ సారి ఆసియా కప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ పోరు కీలకంగా మారనుంది. రెండు జట్లు సెప్టెంబర్‌ 14న తలపడనున్నాయి. ఈ పోరుకు ఆసియా వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే, బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ వంటి జట్లు కూడా బలమైన పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.

గ్రూప్‌ దశ తర్వాత సూపర్‌ 4లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. సెప్టెంబర్‌ 20 నుంచి 26 వరకు సూపర్‌ 4 మ్యాచ్‌లు జరగనున్నాయి. చివరగా, సెప్టెంబర్‌ 28న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. మొత్తంగా, యూఏఈ వేదికగా జరగనున్న ఈ ఆసియా కప్‌ ఆసియా క్రికెట్ అభిమానులకు పండుగలా మారబోతోంది.