Ind Vs SA: IND VS SA: భారత బౌలర్ల వైఫల్యం…తొలి T20లో సఫారీల ఘనవిజయం..!

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి T20లో టీమిండియా ఓటమి పాలైంది. భారీ స్కోరు చేసినా...బౌలర్ల వైఫల్యంతో పరాజయం తప్పలేదు.

Published By: HashtagU Telugu Desk
Ind Vs Sa

Ind Vs Sa

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి T20లో టీమిండియా ఓటమి పాలైంది. భారీ స్కోరు చేసినా…బౌలర్ల వైఫల్యంతో పరాజయం తప్పలేదు. భారత్ నిర్దేశించిన 212 పరుగుల టార్గెట్ ను సౌతాఫ్రికా జట్టు 19.1 ఓవర్లలోనే ఛేదించేసింది. దీంతో 7 వికెట్ల తేడాతో భారీవిజయంసాధించింది. ఆ జట్టు ఆటగాళ్లు డుస్సెన్ 75నాటౌట్ గా నిలిచాడు. డేవిడ్ మిల్లర్ 64 నాటౌట్ చెలరేగి ఆడాడు. ఓపెనర్లు డికాక్ 22, బవుమా 10 విఫలమైనా పది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసినా జట్టు ఘన విజయం సాధించిందంటే ఇద్దరే ఆటగాళ్లే కారణం అని చెప్పొచ్చు.

IPLలో చక్కని ఆటతీరు కనబరిచిన డేవిడ్ మిల్లర్ ఆ ఫాంను ఈ మ్యాచ్ లోనూ చూపించాడు. 5 సిక్స్, 4 ఫోర్ల తేడాతో 64 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. డుస్సెన్ 5సిక్స్ లు, 7 ఫోర్లతో 75పరుగులు చేశాడు. వీరిద్దరూ కూడా సౌతాఫ్రియా విజయంలో మెయిన్ రోల్ పోషించారు. వీళ్లిద్దరూ సిక్సర్లు, ఫోర్లతో భారత బౌలర్లను ఉరుకులు పరుగులు పెట్టించారు. ఇక భారత బౌలర్లలో హర్షల్ పటేల్, భువనేశ్వర్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసినా ….భారీ పరుగులు సమర్పించుకున్నారు. ఈ విజయంతో ఐదు T20ల సిరీస్ లో సౌతాఫ్రికా 1-0ఆధిక్యంలో నిలిచింది.

  Last Updated: 09 Jun 2022, 11:39 PM IST