Site icon HashtagU Telugu

Indian Women’s Hockey Team: హాకీ అభిమానులకు బ్యాడ్ న్యూస్‌.. ఓడిన భారత మహిళల హాకీ జట్టు

Indian Women's Hockey Team

Safeimagekit Resized Img (6) 11zon

Indian Women’s Hockey Team: భారత హాకీ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్‌. ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు పాల్గొనే అవకాశం లేదు. భారత మహిళల హాకీ జట్టు (Indian Women’s Hockey Team) ఒలింపిక్స్‌లో పాల్గొనే చివరి అవకాశాన్ని కోల్పోయింది. క్వాలిఫయర్స్‌లో జపాన్ చేతిలో 0-1 తేడాతో ఓటమి పాలైన భారత్ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. భారత మహిళల హాకీ జట్టు 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 4వ స్థానంలో నిలిచింది. ఆటతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి అభిమానులకు కొత్త ఆశను ఇచ్చింది. అయితే మూడేళ్ల తర్వాత అభిమానులకు నిరాశే ఎదురైంది.

2024లో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు కనిపించదు. జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడో ర్యాంక్‌కు అర్హత సాధించేందుకు జరిగిన పోరులో టీమిండియా విఫలమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయి నాలుగో స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు బాగా ఆడినా.. చివరికి 0-1 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో జపాన్ అద్భుతమైన డిఫెన్సివ్ ఆటను ప్రదర్శించి మ్యాచ్‌ను గెలుచుకుంది.

Also Read: Iran Attack : ఇండియన్ నేవీ అలర్ట్.. హిందూ మహాసముద్రంలో ఇరాన్ ఎటాక్స్

రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జపాన్ 9వ నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ ద్వారా ఉరత కనా గోల్ చేయడంతో ఆధిక్యంలోకి వెళ్లింది. దీని తర్వాత మ్యాచ్ తొలి క్వార్టర్ ముగియడంతో భారత్ 0-1తో వెనుకంజలో ఉంది. కానీ రెండవ క్వార్టర్‌లో పరిస్థితి మారిపోయింది. పెనాల్టీ కార్నర్‌ను భారత క్రీడాకారిణి లాల్‌రెమ్‌సామి గెలుచుకుంది. కానీ జపాన్ గోల్ కీపర్ అద్భుతంగా సేవ్ చేసి మ్యాచ్‌లో తన జట్టును 1-0తో ముందంజలో ఉంచింది.

దీని తర్వాత మ్యాచ్ సగం సమయం జరగడంతో భారత్ 0-1తో వెనుకబడి ఉంది. ఆ తర్వాత ఆట మూడో క్వార్టర్‌లో కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఈ మ్యాచ్‌లో జపాన్ 1-0 ఆధిక్యంలో కొన‌సాగింది. ఇప్పుడు చివరి 15 నిమిషాల్లో అంటే నాలుగో క్వార్టర్‌లో కనీసం ఒక గోల్‌ చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుని, జపాన్‌ను రెండు గోల్స్ చేసి మ్యాచ్‌ని గెలుచుకునే అవకాశం భారత్‌కు ఉంది. అయితే భారత్‌.. జపాన్‌ను అదుపులో ఉంచింది. కానీ గోల్‌ చేయలేకపోయింది.

We’re now on WhatsApp. Click to Join.