IBSA World Games: భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. IBSA వరల్డ్ గేమ్స్ (IBSA World Games)లో ఆస్ట్రేలియాను ఓడించి భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. బర్మింగ్‌హామ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కంగారూలను ఓడించి స్వర్ణం సాధించింది.
IBSA వరల్డ్ గేమ్స్‌లో భారత పురుషుల అంధుల క్రికెట్ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. ఇప్పుడు ఫైనల్లో భారత పురుషుల అంధుల క్రికెట్ జట్టు ముందు పాకిస్థాన్ సవాల్ ఎదురుకానుంది. అయితే, మహిళల జట్టు తర్వాత పురుషుల జట్టు నుంచి స్వర్ణం వస్తుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు. అంతకుముందు ఐబిఎస్‌ఎ వరల్డ్ గేమ్స్ లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్.. భారత జట్టును ఓడించింది. తద్వారా లీగ్ మ్యాచ్ లో ఎదురైన ఓటమికి పాకిస్థాన్ ను టైటిల్ మ్యాచ్ లో ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో భారత జట్టు రంగంలోకి దిగనుంది.
Also Read: Dhoni Viral Video: జిమ్ లో ధోనీ .. వైరల్ అవుతున్న వీడియో
IBSA వరల్డ్ గేమ్స్‌లో క్రికెట్ మొదటిసారిగా చేర్చబడింది. తద్వారా భారత జట్టు బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. మరోవైపు భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 9 ఓవర్లలో 8 వికెట్లకు 114 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా భారత్ 3.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. అయితే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో భారత జట్టును విజేతగా ఎంపిక చేశారు.