Indian Team: టీమిండియా ప్రపంచ కప్ జట్టులో కూడా ముంబైదే ఆధిపత్యం.. గుజరాత్ టైటాన్స్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు చోటు..!

ODI ప్రపంచ కప్ 2023 కోసం టీమిండియా (Indian Team) 15 మంది సభ్యుల జట్టును మంగళవారం ప్రకటించింది. మెగా ఈవెంట్ ప్రారంభానికి కేవలం ఒక నెల ముందు బీసీసీఐ జట్టుని అనౌన్స్ చేసింది.

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 11:56 AM IST

Indian Team: ODI ప్రపంచ కప్ 2023 కోసం టీమిండియా (Indian Team) 15 మంది సభ్యుల జట్టును మంగళవారం ప్రకటించింది. మెగా ఈవెంట్ ప్రారంభానికి కేవలం ఒక నెల ముందు బీసీసీఐ జట్టుని అనౌన్స్ చేసింది. శ్రీలంకలోని క్యాండీలో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి టీమ్ ఇండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జట్టును ప్రకటించారు. టీమ్‌ ప్రకటనతో అభిమానుల్లో ప్రత్యేక చర్చ కూడా కనిపించింది. ప్రపంచకప్ జట్టులో ఏ ఐపీఎల్ జట్టు ఆధిపత్యం చెలాయించింది అని అభిమానులు సోషల్ మీడియాలో నిరంతరం చర్చించుకోవడం కనిపించింది.

15 మంది సభ్యులతో కూడిన భారత ప్రపంచ కప్ జట్టును పరిశీలిస్తే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు నలుగురు ప్రపంచ కప్ జట్టుకి ఎంపికయ్యారు. భారత్, ముంబై ఇండియన్స్ జట్లకు రోహిత్ శర్మ కెప్టెన్సీని నిర్వహిస్తున్నాడు. రోహిత్ సహా మొత్తం నలుగురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇందులో రోహిత్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా పేర్లు ఉన్నాయి.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, గుజరాత్ టైటాన్స్‌కు చెందిన హార్దిక్ పాండ్యా, శుభమన్ గిల్ ఇతర ఐపీఎల్ జట్ల నుంచి ఆటగాళ్లు ఎంపికయ్యారు.

Also Read: Hima Das: భారత స్టార్‌ అథ్లెట్‌ హిమదాస్‌పై ఏడాది పాటు సస్పెన్షన్‌.. కారణమిదేనా..?

చెన్నై, లక్నో నుండి ఒక్కొక్క ఆటగాడు

ఐపీఎల్ 16వ సీజన్ టైటిల్‌ను గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నుండి కేవలం 1 ఆటగాడు మాత్రమే ప్రపంచకప్ జట్టులో స్థానం పొందాడు. అది కూడా రవీంద్ర జడేజా. దీంతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు చెందిన లోకేశ్ రాహుల్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యాడు. దీంతో పాటు భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల నుంచి ఒక్క ఆటగాడికి కూడా చోటు దక్కలేదు.

భారత ప్రపంచ కప్ జట్టులో IPL ఫ్రాంచైజీకి చెందిన ప్లేయర్స్

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్
గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ
ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్
కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్
చెన్నై సూపర్ కింగ్స్: రవీంద్ర జడేజా
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్