వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్‌ గిల్‌ ఔట్?

టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఫామ్, వైస్ కెప్టెన్సీపై సెలెక్టర్లు ఏం చేయాలో అర్థంగాక సతమతమవుతున్నారు. మరోవైపు గిల్‌ను పక్కనబెట్టి ఆ స్థఆనంలో యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌లకు అవకాశం ఇవ్వాలా అనే చర్చ జరుగుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ ద్వారా ఆటగాళ్లపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్‌ స్క్వాడ్‌పై బీసీసీఐ […]

Published By: HashtagU Telugu Desk
T20 World Cup

T20 World Cup

టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఫామ్, వైస్ కెప్టెన్సీపై సెలెక్టర్లు ఏం చేయాలో అర్థంగాక సతమతమవుతున్నారు. మరోవైపు గిల్‌ను పక్కనబెట్టి ఆ స్థఆనంలో యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌లకు అవకాశం ఇవ్వాలా అనే చర్చ జరుగుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ ద్వారా ఆటగాళ్లపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.

  • టీ20 వరల్డ్ కప్‌ స్క్వాడ్‌పై బీసీసీఐ కసరత్తులు
  • గిల్ ఓపెనింగ్ స్లాట్‌తో సంజు ప్లేస్‌కి ఇబ్బందులు
  • బ్యాకప్ ఓపెనర్‌గా జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలని ఆలోచన

టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు ఎంపికకు ముందు భారత స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఫామ్ బీసీసీఐ సెలెక్టర్లకు ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారిందని నేషనల్ మీడియా వెల్లడించింది. గిల్‌ను 15 మంది సభ్యుల తుది జట్టులోంచి తప్పించే అవకాశాలు తక్కువగానే ఉన్నప్పటికీ, ఇటీవల మ్యాచ్‌ల్లో అతని బ్యాటింగ్ ప్రదర్శనపై లోతైన చర్చ జరుగుతోందని ఆ రిపోర్ట్ పేర్కొంది. ముఖ్యంగా గిల్ వైస్ కెప్టెన్‌గా కొనసాగాలా? అనే ప్రశ్న కూడా సెలెక్షన్ కమిటీ ముందు ఉందని సమాచారం. ఓపెనర్‌గా గిల్‌ను కొనసాగించడంవల్ల సంజు శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకు వెళ్లాల్సి వస్తుండటం కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది.

సెప్టెంబర్ నుంచి గిల్ ఆసియా కప్‌తో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లో ఆడినప్పటికీ, అత్యధిక స్కోర్ కేవలం 47 మాత్రమే. ఈ ఫామ్ డిప్ కారణంగా, జట్టులో ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలా? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. గిల్ సాధారణంగా ఇన్నింగ్స్ ఆరంభంలో నెమ్మదిగా ఆడే బ్యాటర్ కావడంతో, మరో వైపు అబిషేక్ శర్మ తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడాల్సిన ఒత్తిడిలో పడుతున్నాడని సెలెక్టర్లు భావిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో జైస్వాల్ లేదా ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకుంటే యువ ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ వరకు 15 మంది జట్టులో మార్పులు చేసే అవకాశం బీసీసీఐకి ఉంది. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో, దుబాయ్‌లోని పిచ్‌లను పరిగణలోకి తీసుకొని యశస్వి జైస్వాల్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నారు. ఈ అంశాలు అన్నింటినీ బీసీసీఐ పరిగణనలోకి తీసుకోనుంది.

భారత గడ్డపై జరగనున్న టీ20 వరల్డ్‌కప్ సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్‌గా చివరి గ్లోబల్ ఈవెంట్ కావొచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇప్పటికే 35 ఏళ్ల సూర్య, గత ఏడాది కాలంగా ఫామ్‌లో లేకపోవడం అతని భవితవ్యంపై ప్రశ్నలు పెంచుతోంది. సుమారు 14 నెలలుగా, 24 మ్యాచ్‌ల్లో సూర్య అంచనాలకు తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయినా, కెప్టెన్ కావడం వల్లే అతను జట్టులో కొనసాగుతున్నాడన్న విశ్లేషణ కూడా జరుగుతోంది.

వరల్డ్ కప్‌కు ముందు న్యూజిలాండ్‌తో ఆడే టీ20 సిరీస్‌కు కూడా ఇదే జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్తగా స్థానాలు ఖాళీగా లేనప్పటికీ, గిల్ స్థానం పదేపదే పరిశీలనలోకి వస్తుండగా, యశస్వి జైస్వాల్ బెంచ్‌పై వేచి చూస్తున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు జైస్వాల్‌ను అదనపు ఆటగాడిగా ఎంపిక చేసి, అవసరమైతే వరల్డ్ కప్‌లో వినియోగించాలన్న ఆలోచనపై కూడా సెలెక్టర్లు దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

 

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత జట్టు 
అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, అక్షర్‌ పటేల్‌ (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా,  ఇషాన్‌ కిషన్‌, రింకూ సింగ్‌.

  Last Updated: 20 Dec 2025, 02:26 PM IST