Site icon HashtagU Telugu

India vs Sri Lanka: నేటి నుంచే శ్రీలంకతో T20 సిరీస్‌.. ఆ ముగ్గురు లేకుండానే బరిలోకి..!

Team India Vs Aus Imresizer

Team India Vs Aus Imresizer

కొత్త సంవత్సరంలో టీమ్ ఇండియా తన కొత్త మిషన్‌ను ప్రారంభించింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో జనవరి 3 (మంగళవారం) నుంచి శ్రీలంకతో టీ20 సిరీస్ (India vs Sri Lanka) ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ లేకుండానే టీమ్ ఇండియా రంగంలోకి దిగుతోంది. T20 ప్రపంచ కప్ 2022 తర్వాత టీమ్ ఇండియా ఈ ఫార్మాట్‌లో ఆడిన విధానంపై ప్రశ్నలు తలెత్తాయి. జట్టులో పెద్ద మార్పుల గురించి చర్చ జరిగింది. హార్దిక్ పాండ్యాను టీమిండియా T20కి కొత్త కెప్టెన్‌గా చేయవచ్చు.. కాబట్టి ఈ సిరీస్ టీమిండియా మార్పుకు నాంది కావచ్చు. జనవరిలోనే కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి, కొత్త కెప్టెన్‌పై తుది నిర్ణయం తీసుకోనుంది బీసీసీఐ.

T20 క్రికెట్‌లో రోహిత్-రాహుల్‌ల విధానంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓపెనింగ్ జోడీని కూడా టీ20 ఫార్మాట్‌లో మార్చాలనే డిమాండ్ వచ్చింది. ఈ సిరీస్‌లో, ముగ్గురు ఓపెనర్లు ఇషాన్ కిషన్, రితురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్ రూపంలో కలిసి వస్తున్నారు. అటువంటి పరిస్థితిలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎవరిని విశ్వసిస్తాడో చూడాలి. ఈ సిరీస్‌తో భారత్ కొత్త బౌలింగ్ యూనిట్‌ను కూడా పొందవచ్చు. భువనేశ్వర్ కుమార్ టీ20 సిరీస్ నుంచి తప్పుకోవడంతో పాటు జస్ప్రీత్ బుమ్రా కూడా ఇప్పటి వరకు తిరిగి రాలేకపోయాడు. అటువంటి పరిస్థితిలో ఫాస్ట్ బౌలింగ్ బాధ్యత అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్ చేతుల్లో ఉంటుంది. వీరితో పాటు యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ స్పిన్‌ బాధ్యతను చూసుకుంటారు.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య నేడు తొలి టీ20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేడు రాత్రి 7.00 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే సాయంత్రం 6.30 గంటలకు టాస్ ఉంటుంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో టీమ్ ఇండియా కొత్త వ్యూహంతో ముందుకు సాగాలని కోరుకుంటోంది. అంతేకాకుండా 2023 సంవత్సరానికి బలమైన ఆరంభాన్ని అందించాలనుకుంటోంది.

Also Read: Rishabh Pant : రిషబ్ పంత్ పర్సు, బంగారు కంకణం, గొలుసు, క్యాష్ దొంగలించబడ్డవా?

టీ20 సిరీస్ కోసం భారత జట్టు: హార్దిక్ పాండ్యా (C), ఇషాన్ కిషన్ (WC), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (VC), దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ , హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముఖేష్ కుమార్.

Exit mobile version