Indian Shooters Win Gold: బిగ్ బ్రేకింగ్.. ఆసియా క్రీడలలో భారత్ కు నాలుగో స్వర్ణం

చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడలలో భారత్ సత్తా చాటుతుంది. ఆసియా క్రీడలు 2023లో భారత్ నాలుగో స్వర్ణం (Indian Shooters Win Gold) సాధించింది. ఈసారి 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణం సాధించింది.

Published By: HashtagU Telugu Desk
Win Gold

Compressjpeg.online 1280x720 Image (1) 11zon

Indian Shooters Win Gold: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడలలో భారత్ సత్తా చాటుతుంది. ఆసియా క్రీడలు 2023లో భారత్ నాలుగో స్వర్ణం (Indian Shooters Win Gold) సాధించింది. ఈసారి 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణం సాధించింది. భారతదేశ షూటింగ్ బృందంలో మను భాకర్, ఇషా సింగ్, రిథ్మ్ సాంగ్వాన్ త్రయం ఉన్నారు. ఈ త్రయం 1759 పాయింట్లతో భారత్ కి గోల్డ్ సాధించారు. ఈ ఆసియా క్రీడలలో భారత్ మొత్తం 16 పతకాలు సాధించగా.. అందులో 4 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. అంతకముందు షూటింగ్ విభాగంలో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ మహిళల టీమ్ ఈవెంట్‌లో భారత్ (ఆషి చౌక్సే, మణిని కౌశిక్, సిఫ్ట్ కౌర్ సమ్రా) రజతం కైవసం చేసుకుంది.

Also Read: Virat Kohli ODI Retirement: 2023 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ వన్డే, టీ20 ఫార్మాట్‌లకు వీడ్కోలు..?!

50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మహిళల జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. భారతదేశం 50 మీటర్ల మహిళల రైఫిల్ జట్టులో సిఫ్ట్ కౌర్ సమ్రా, మణిని కౌశిక్, ఆషి చోక్సీ ఉన్నారు. షూటింగ్ ఈవెంట్‌లో మహిళల త్రయం రెండో స్థానంలో నిలిచి రజతం సాధించింది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 15వ పతకం. 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో చైనా మహిళల జట్టు నంబర్‌వన్‌గా నిలిచి స్వర్ణం సాధించింది. ఇప్పటివరకు ఆసియా క్రీడల్లో అత్యధిక స్వర్ణం సాధించిన దేశంగా ఆతిథ్య చైనా నిలిచింది. భారత జట్టు నాలుగు బంగారు పతకాలు సాధించింది.

అంతకుముందు మూడో రోజు భారత గుర్రపు స్వారీ జట్టు చరిత్ర సృష్టించి దేశ ఖాతాలో మూడో స్వర్ణం సాధించింది. 41 ఏళ్ల తర్వాత భారత గుర్రపు స్వారీ జట్టు బంగారు పతకం సాధించింది. ఆసియా గేమ్స్ రెండో రోజు షూటింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం వచ్చింది. ఆ తర్వాతి రోజే ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి భారత మహిళల క్రికెట్‌ స్వర్ణం సాధించింది. గుర్రపు స్వారీ జట్టు దేశానికి మూడో స్వర్ణం అందించింది. నాలుగో రోజైన బుధవారం 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత్ మరో స్వర్ణం సాధించింది.

ఆసియా క్రీడల్లో నాలుగో రోజు భారత్‌ పేరిట ఇప్పటివరకు మొత్తం 16 పతకాలు నమోదయ్యాయి. 16లో 4 స్వర్ణాలు, 5 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి. నాలుగో రోజు భారత్ ఖాతాలో ఇప్పటివరకు రెండు పతకాలు చేరాయి. దేశ ఖాతాలో తొలి పతకం రజతం రూపంలో చేరింది. ఇప్పటి వరకు రెండు పతకాలు భారత మహిళల జట్లే గెలుచుకున్నాయి.

  Last Updated: 27 Sep 2023, 10:00 AM IST