Site icon HashtagU Telugu

WTC Final 2023: వృద్ధిమాన్ విషయంలో సెలెక్టర్లపై కుంబ్లే ఫైర్

WTC Final 2023

New Web Story Copy (100)

WTC Final 2023: భారత జట్టు సెలక్టర్లపై భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే విమర్శలు గుప్పించాడు. అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహాను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు తీసుకోకుండా బీసీసీఐ తప్పు చేసిందని కుంబ్లే అన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్లో వృద్ధిమాన్ దుమ్ముదులుపుతున్నాడు. సాహా ప్రదర్శన అద్భుతంగా కనిపిస్తుంది. గుజరాత్ టైటాన్స్ తరఫున సాహా ఈ ఐపీఎల్ లో 11 మ్యాచ్‌ల్లో 273 పరుగులు చేశాడు.

జియో సినిమాపై జరిగిన కార్యక్రమంలో అనిల్ కుంబ్లే మాట్లాడుతూ “వృద్ధిమాన్ సాహా కీపర్ గానే కాకుండా బ్యాట్‌తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. సాహా భారతదేశంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడు.” అంటూ ప్రశంసించారు. సాహా విషయంలో సెలెక్టర్లు పొరపాటు చేశారని నేను భావిస్తున్నాను అని చెప్పారు. అతను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత జట్టులో చోటు దక్కాల్సిందని అభిప్రాయపడ్డారు.

కేఎల్ రాహుల్ గాయపడడంతో అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను భారత సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో రిషబ్ పంత్ స్థానంలో కేఎస్ భరత్‌కి జట్టులో అవకాశం కల్పించారు. ఇప్పుడు బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్ (వికెట్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జైదేవ్ ఉనద్కత్, ఇషాన్ ఉనద్కత్ (వికెట్ కీపర్)

Read More: Maharashtra Politics Judgment : ఉద్ధవ్‌ సర్కారును పునరుద్ధరించలేం : సుప్రీం