Indian Racing League: ఇండియన్ రేసింగ్‌ లీగ్‌ ఫైనల్‌ పోటీలకు అంతా రెడీ

  • Written By:
  • Publish Date - December 10, 2022 / 06:30 AM IST

హైదరాబాద్‌ ఇండియన్ రేసింగ్ లీగ్ (Indian Racing League) మళ్లీ సందడి చేయనుంది. ఐఆర్ఎల్ (IRL) తుది దశ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ సిద్ధమైంది. శని, ఆదివారాల్లో హుస్సేన్ సాగర్ తీరం నెక్లెస్ రోడ్డులోని 2.8 కిలో మీటర్ల ట్రాక్‌పై రేసింగ్ (Indian Racing League) కార్లు దూసుకెళ్లనున్నాయి. ఆదివారం ఒక స్ప్రింట్, మరో ఫీచర్ రేసును నిర్వహిస్తారు. గత నెల 19, 20 తేదీల్లో హైదరా బాద్ లో తొలి రౌండ్ జరిగింది. రెండో రోజు పోటీల్లో చెన్నై టర్బో రైడర్స్, గోవా ఏసెస్ కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌ను అర్ధంతరంగా నిలిపివేశారు.

ట్రాక్లో ఎలాంటి మార్పులు చేయట్లేద కఠినమైన భద్రత నిబంధనల్ని పాటిస్తూ తుది దశ పోటీల్ని పూర్తిచేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఇండియా లో మొదటి సారి జరుగుతున్న లీగ్ రేస్‌లను హైద్రాబాద్ , చెన్నైలో నిర్వహిస్తున్నారు. అయితే మొదటి రౌండ్ హైదరాబాద్ లో నిర్వహణ లోపం కారణంగా మొదటి రౌండ్ రేస్ జరగలేదు. ప్రాక్టీస్ రేస్‌లతోనే ముగిసింది. నవంబరు 25-27 వరకు రెండో రౌండ్, ఈనెల 2-4 వరకు మూడో రౌండ్ రేసులకు చెన్నై ఆతిథ్యమిచ్చింది.

ఇదిలా ఉంటే ఇండియన్ కార్ రేసింగ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు కూడా అమల్లోకి తీసుకొచ్చారు. రెండు రోజుల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.హుస్సేన్ సాగర్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్, సంజీవయ్య పార్క్ మీదుగా ఈ ట్రాక్ ఉంటుంది. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ హుస్సేన్ సాగర్ చుట్టూ జరుగనుంది. ఎన్టీఆర్ మార్గ్ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లడానికి అనుమతి లేదు. ఈ ట్రాఫిక్‌ ను పిజేఆర్ విగ్రహం, షాదన్ కాలేజీ, రవీంద్ర భారతి వైపు మళ్లించారు.

Also Read: Ind W Team: తొలి టీ ట్వంటీలో భారత మహిళల ఓటమి

అలాగే బుద్ధ భవన్ – నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రాణిగంజ్ – ట్యాంక్‌ బండ్ వైపు మళ్లించారు. రసూల్‌ పురా – మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లించారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కట్ట మైసమ్మ దేవాలయం వైపు మళ్లించారు. బీఆర్‌ కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్ – రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించారు. ఫార్ములా ఈ కార్ల రేసింగ్ కారణంగా ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్‌ ను శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూసివేయనున్నారు. ఈ రూట్లలో వెళ్లే వాహనదారులు ప్రత్నామాయ రూట్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.